Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: 70 ఏళ్ల వయసులో.. ప్రభాస్ సినిమా కోసం గోడ దూకిన స్టార్ నటుడు.. వీడియో వైరల్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ స్టార్ హీరో చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలున్నాయి. ఇందులో ఫీల్ గుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజి (రూమర్డ్ టైటిల్) సినిమా కూడా ఉంది.

Prabhas: 70 ఏళ్ల వయసులో.. ప్రభాస్ సినిమా కోసం గోడ దూకిన స్టార్ నటుడు.. వీడియో వైరల్
Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2025 | 12:35 PM

ప్రభాస్ ప్రస్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి సినమా షూటింగ్ లో బిజీ కానున్నాడు డార్లింగ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మారుమూల ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఏకంగా నిచ్చెన వేసుకుని గోడ దూకాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేరే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

‘నా 40 ఏళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో షూటింగ్ లోకేషన్స్‌లోకి వెళ్లాను. కానీ, ఈ రోజు జరిగింది మాత్రం చాలా ప్రత్యేకమైనది, నవ్వు తెప్పించేది కూడా. నేను ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. కారులో షూటింగ్ లోకేషన్‌కు బయలుదేరాను. అయితే మా డ్రైవర్ కారును అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకొని వచ్చి ఆపేశాడు.ముందుకు పోవ‌డానికి లేదు, వెనక్కు రావడానికి కూడా లేదు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు అనుపమ్ ఖేర్. దీనికి ‘కుచ్ బీ హో సక్తా హై’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారీ సీనియర్ నటుడు.

ఇవి కూడా చదవండి

గోడ దూకుతోన్న అనుపమ్ ఖేర్.. వీడియో

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

ప్ర‌భాస్ షూట్ జ‌రిగే ప్రాంతానికి నేరుగా కారు వెళ్లే మార్గం లేదు. దీంతో చిన్న నిచ్చెన సాయంతో అనుప‌మ్ ఖేర్ గోడ ఎక్కి ఆ తర్వాత అవతలికి దిగారు. 70 ఏళ్ల వయసులో అనుపమ్ ఖేర్ చేసిన ప‌నిపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?