AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! ఈ హీరోయిన్ మామూల్ది కాదు.. మూడు పెళ్లిళ్లు.. ఆరుగురు పిల్లలు.. చివరకు ఇలా

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు.

బాబోయ్..! ఈ హీరోయిన్ మామూల్ది కాదు.. మూడు పెళ్లిళ్లు.. ఆరుగురు పిల్లలు.. చివరకు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2025 | 12:32 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్లు, డైవర్స్ అనేవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.  ఇప్పటికే చాలా మంది స్టార్ కపుల్ విడిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే.. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు. వారిజీవితంలో ఏం జరిగినా అది పెద్ద చర్చే.. ఇక సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

ముఖ్యంగా హీరోయిన్స్.. కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ముగ్గురు నలుగురితో లవ్ ట్రాక్స్ నడిపి ఆతర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్న వారు లేకపోలేదు. కాగా వీళ్లందరిలో ఈ అమ్మడు కాస్త డిఫరెంట్.. ఈ అమ్మడి ఆస్తిపాస్తులు వేల కోట్లు. ఇప్పటి వరకు ముగ్గురితో పెళ్లి.. ఆరుగురు పిల్లలు. చివరిగా తనను తాను చంపుకునేందుకు కిరాయి గుండాలను కూడా సెట్ చేసుకుంది.

ఆమె ఎవరో కాదు.. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ. జోలీ తన చిన్నతనంలో తండ్రితో కలిసి “లుకిన్ టు గెట్ అవుట్” (1982) చిత్రంలో నటించింది. ఆమె హాలీవుడ్ కెరీర్ 1993లో “సైబోర్గ్ 2″తో ప్రారంభమైంది, కానీ “హ్యాకర్స్” (1995) చిత్రంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. జోలీ మూడు వివాహాలు చేసుకుంది జానీ లీ మిల్లర్ (1996-1999), బిల్లీ బాబ్ థోర్న్టన్ (2000-2003),  బ్రాడ్ పిట్ (2014-2019). బ్రాడ్ పిట్‌తో ఆమెకు “బ్రాంజెలీనా”గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. ఆతర్వాత విడాకులు తీసుకున్నారు. 2013లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆమె డబుల్ మాస్టెక్టమీ చేయించుకుంది. అలాగే 20 సంవత్సరాల వయస్సులో జోలీ తీవ్ర నిరాశకు గురైంది. తనను తాను హత్య చేయించుకోవడానికి ఒక కిల్లర్‌ను నియమించుకున్నా అని తెలిపింది. అలా ఎందుకు చేసిందంటే.. ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబం బాధపడుతుందని.. హత్య చేయించుకోవాలనుకున్నా అని తెలిపింది జోలీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?