Kannappa: వాళ్లు నాకు భయపడతారు.. కన్నప్ప సినిమాలో నటించకపోవడం పై మంచు లక్ష్మీ..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఒక భారీ పాన్-ఇండియా సినిమా కన్నప్ప. ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు.

మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ను ప్రారంభించిన లక్ష్మి ఇప్పటి వరకు అన్నీ కలిసి 20 ఫీచర్ ఫిల్మ్స్ లో నటించింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. నిర్మాతగానూ చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. అయితే మంచు ఫ్యామిలీ ఈమధ్య వార్తల్లో నిలుస్తుంది. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వివాదం కొనసాగుతుంది. రోజు ఎదో ఒక పంచాయితీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వివాదం సమసిపోయిందని తెలుస్తుంది.
మోహన్ బాబు ప్రస్తుతం విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు. అలాగే మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. అలాగే మరో రెండు మూడు సినిమాలు లైనప్ చేశారు. అయితే ఈ వివాదంలో కానీ.. బయట ఎక్కడైనా మంచి లక్ష్మీ మాత్రం కనిపించడం లేదు. గతకొద్ది రోజులుగా మంచు లక్ష్మీ సైలెంట్ గా ఉంటున్నారు. మొన్నామధ్య మంచు లక్ష్మీ యక్షిణి అనే వెబ్ సిరీస్ లో నటించింది
ఈ సిరీస్ తెలుగు, హిందీలో తెరకెక్కింది. గతంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో మంచు లక్ష్మీ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఆమె తన మకాంమార్చి ముంబైకు వెళ్లారు. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. నాకు ఏ వుడ్ అయినా ఒక్కటే.. హాలీవుడ్ నుంచి వచ్చా.. కోలీవుడ్ లో సినిమాలు చేశా.. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నా.. యాక్టింగ్ అనేది నా కెరీర్.. ఆతర్వాత నేను మనిషిగా, ఓ తల్లిగా జీవితాన్ని గడపాలి. హైదరాబాద్ నా ఇల్లు. జీవితాంతం నేను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటాం.. అంటూ చెప్పుకొచ్చారు. అలాగే కన్నప్ప సినిమాలో నటించకపోవడం గురించి మాట్లాడుతూ.. నాతో కలిసి నటించడానికి మా తమ్ముళ్లు భయపడతారు. అందుకే నేను నటించడం లేదు.. నేను స్క్రీన్ మీద ఉంటే.. వాళ్లు కనిపించరు అని తెలిపారు. అయినా అది వాళ్ళ సినిమా.. వాళ్లనే అడగండి. ఒకవేళ నాకు సరిపోయే పాత్ర కన్నప్పలో లేదేమో.. అందుకే నన్ను అడగలేదు.. మనోజ్ కూడా లేడు అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ గతంలో జరిగింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి