Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT : ఇదెక్కడి వెబ్ సిరీస్ రా మావ..! IMDbలో 9.1/10 రేటింగ్.. ఓటీటీని ఊపేస్తున్న సిరీస్

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి.

OTT : ఇదెక్కడి వెబ్ సిరీస్ రా మావ..! IMDbలో 9.1/10 రేటింగ్.. ఓటీటీని ఊపేస్తున్న సిరీస్
Web Series
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2025 | 10:48 AM

సినిమాలు థియేటర్స్ లో ఏ రేంజ్ లో హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతున్నాయి. ఓవైపు థియేటర్స్ లో సినిమాలు అదరగొడుతుంటే మరో వైపు ఓటీటీలోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయ్. ఇక ప్రస్తుతం ఓటీటీల్లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ్, మలయాళ భాషలకు చెందిన వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే కన్నడలో మాత్రం వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదు. అయితే ఇటీవల విడుదలైన ఓఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీని షేక్ చేసింది.

గుల్లక్ అనేది హిందీ వెబ్ సిరీస్. సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు శ్రేయాంశ్ పాండే దర్శకత్వం. ఇది ఒక చిన్న పట్టణంలో జీవించే మధ్యతరగతి మిశ్రా కుటుంబం, వారి రోజువారీ జీవితం చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ కామెడీ, ఎమోషన్, మరియు కుటుంబ సంబంధాలను అద్భుతంగా మిళితం చేస్తుంది.

ఇది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనుభవాలను ప్రతిబింబిస్తుంది. గుల్లక్ ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో నివసించే మిశ్రా కుటుంబ జీవితాన్ని చిత్రిస్తుంది. సంతోష్ మిశ్రా (పిత), శాంతి మిశ్రా (మాత), వారి ఇద్దరు కుమారులు ఆనంద్ (అన్ను), అమన్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ సిరీస్ వారి రోజువారీ సవాళ్లు, చిన్న చిన్న ఆనందాలు, కలహాలు, కుటుంబ బంధాలను హాస్యభరితంగా, ఎమోషనల్ చూపిస్తుంది. ఈ కథలు సాధారణ జీవిత సంఘటనల చుట్టూ తిరుగుతాయి, అయినప్పటికీ అవి లోతైన భావోద్వేగాలను, సామాజిక సందేశాలను అందిస్తాయి. గుల్లక్ ఒక ఫీల్-గుడ్ సిరీస్, ఇది కుటుంబంతో కలిసి చూడడానికి అనువైనది. ఇది హాస్యం, భావోద్వేగం, మరియు జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించే విధంగా చిత్రీకరించబడింది. ఈవెబ్ సిరీస్ IMDbలో 9.1/10 రేటింగ్ సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.