AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ అవ్వడానికి మిస్ ఇండియా పోటీలను కూడా వద్దనుకుంది.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది కోట్లు కూడబెడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

డాక్టర్ అవ్వడానికి మిస్ ఇండియా పోటీలను కూడా వద్దనుకుంది.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2025 | 8:36 PM

Share

ఈ ఫొటోలో ఉన్న అమ్మడు టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అంతే కాదు  తల్లిదండ్రూలిద్దరూ ప్రముఖ నటులే. వారిద్దరి అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ ముద్దుగుమ్మ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ సైన్ చేసిన మొదటి రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఐరన్ లెగ్ అంటారేమోనన్న భయంతో సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందీ అందాల తార. అయితే సినిమా రంగంలో ఎంతో అనుభవమున్న తల్లిదండ్రుల సూచనలతో క్రమంగా కోలుకుంది. మళ్లీ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుసగా సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించింది. అన్నట్లు ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది.

ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా

నటిగా కంటే డాక్టర్ కావడమే తన మొదటి లక్ష్యమంటోంది ఈ అందాల ముద్దుగుమ్మ. అందుకే మిస్ ఇండియా పోటీలను సైతం వద్దనుకుంది. మరి ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్. తాజాగా ఈ అందాల తారకు ఒక పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో శివానీ రాజశేఖర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది

కాగా 2022లో శివానీ రాజశేఖర్ కు ఒక బంపరాఫర్ వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే సువర్ణావకాశం లభించింది. శివానీ కూడా ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నట్లు ఎంతో సంతోషంగా ప్రకటించింది. కానీ కొన్ని రోజులకే సడెన్‌గా ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. శివానీ ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్ రోజునే.. ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ అదే రోజున ఉన్నందున ఈ అందాల పోటీలో పాల్గొనలేకపోతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది. సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us