50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకొని హీరో, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది 40వచ్చిన పెళ్లి మాట ఎత్తడంలేదు.. అయితే ఈ అమ్మడు ఏకంగా 50ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉంటుంది. అంతే కాదు కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా అందాలు ఆరబోస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి మాట ఎత్తకుండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కుర్ర హీరోలు, కుర్ర హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. చాలా మంది పెళ్లి మాట లేకుండా సింగిల్ గా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు కొందరు భామలు. ఈ అమ్మడు మరీ రాడ్ సింగిల్ అనే చెప్పాలి ఏకంగా 50 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా ఉంటుంది. మొన్నటివరకు ఓ యంగ్ హీరోతో యవ్వారం నడిపింది. ఇప్పుడు అతన్ని కూడా వదిలిపెట్టింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో చాలా ఫెమస్ ఈ చిన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ చేసింది.. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తమ ఇష్టానుసారంగా గడిపే హక్కు ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో తప్పేముంది. దానికి పెళ్లి కావాల్సిన అవసరం అంతకంటే లేదు.. ఇక్కడ స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యం” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకొని ఆతర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఆతర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. తనకన్నా చాలా చిన్నవాడైన అర్జున్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. ఇటీవలే ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది మలైకా.. అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. మలైకా ఇప్పుడు రాహుల్ విజయ్ తో ప్రేమలో పడిందని టాక్. ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. 51ఏళ్ల వయసులోనూ మలైకా తన అందాలతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




