క్యాలెండర్ మారింది.. రూల్స్ కత్తి వేలాడుతోంది.. నేటి నుంచి కొత్త ఐటీ చట్టం..!
ఏప్రిల్ ఫస్ట్.. అంటే ఇన్నాళ్లు ఓ ఓపీనియన్. ఇప్పుడు అది మరో లెవల్, ఇవాళ్టి నుంచి సామాన్యుల జేబులపై భారీ ప్రభావం తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లోని నిబంధనలు అమల్లోకి వచ్చేది నేటి నుంచే. కొన్ని కష్టంగా ఉన్నా కొన్ని కొందరికి ఇష్టంగా ఉన్నా.. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. ఏదేమైనా క్యాలెండర్ మారింది. రూల్స్ కత్తి వేలాడుతోంది.

ఏప్రిల్ ఫస్ట్.. అంటే ఇన్నాళ్లు ఓ ఓపీనియన్. ఇప్పుడు అది మరో లెవల్, ఇవాళ్టి నుంచి సామాన్యుల జేబులపై భారీ ప్రభావం తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లోని నిబంధనలు అమల్లోకి వచ్చేది నేటి నుంచే. కొన్ని కష్టంగా ఉన్నా కొన్ని కొందరికి ఇష్టంగా ఉన్నా.. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. ఏదేమైనా క్యాలెండర్ మారింది. రూల్స్ కత్తి వేలాడుతోంది.
మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంతోపాటు.. ఆదాయపు పన్ను చట్టం 2026 అమల్లోకి వచ్చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్ను శ్లాబ్‌లు, రేటు మార్పులు.. ట్యాక్స్ నిబంధనలు ఆటోమేటిక్‌గా ఏప్రిల్ 1 నుంచి.. అంటే నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలో కోత
ఏడాదికి ఎంత సంపాదన? ఎంతుంటే అంతంటే సరిపోదు. 13 లక్షల రూపాయలు దాటితే ట్యాక్స్ వాత..! అదే ఏడాదికి 12 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్లకు నేటి నుంచి రాజ్యపూజ్యమే.12 లక్షల 75 వేల రూపాయల వరకు ఇన్‌కమ్ ఉన్న వాళ్లు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ఇది ఖుషీ కా బాత్. కానీ ఉద్యోగులకు మాత్రం టేక్ శాలరీలో కటింగ్ తప్పదు. కొత్త లేబర్ చట్టాల ప్రకారం బేసిక్ శాలరీని 50 శాతంగా ఫిక్స్ చేయడంతో.. పీఎఫ్ కటింగ్స్ పెరిగి, చేతికొచ్చే జీతం తగ్గుతుంది. ప్రావిడెంట్ ఫండ్ రూల్స్‌లోనూ మార్పులు చేర్పులు అమలవుతాయి. ఏడాదికి 20లక్షల రూపాయలకు పైగా సంపాదించేవాళ్లు ఇకపై పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై పన్ను చెల్లించాల్సి రావచ్చు.
బ్యాంకింగ్ రంగంలోనూ కీలక మార్పులు
బ్యాంకింగ్ రంగంలోనూ కీలక మార్పులు వచ్చేశాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల శకం ముగిసినట్టే. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు మినిమిం బ్యాలెన్స్ రూల్స్‌ను అమలు చేయనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో యూపీఐ ద్వారా 5 సార్లు మించి క్యాష్ తీస్తే 23 రూపాయల చార్జీ పడనుంది.
UPI పేమెంట్స్‌కు ఝలక్
ఇక డిజిటిల్ ట్రాన్సాక్షన్ అందుబాటులోకి వచ్చాక UPI పేమెంట్ కామన్‌గా మారింది. దాదాపు ప్రతీ ఒక్కరూ గూగుల్ పే.. ఫోన్ పే యూజ్ చేస్తున్నారు. అయితే చాలా మంది యూపీఐ లింక్ చేసుకుని వాటిని వాడడం లేదు. వాడకుండా ఉన్న యూపీఐ లింక్‌లు డీయాక్టివేట్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను విడుదల చేసింది. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త పెన్షన్ పథకం
కేంద్ర ప్రభుత్వ ఏకీకృత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల బేసిక్ శాలరీలో సగటున 50 శాతాన్ని పెన్షన్‌గా పొందుతారు.
కార్పొరేట్ ఎంప్లాయిస్‌కు ఊరట
బెంగుళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇకపై మెట్రో సిటీస్. వీటికి పాత విధానంలో ఎక్కువ HRA మినహాయింపులు వర్తిస్తాయి. ఈ నగరాలను 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు జాబితాలో చేర్చారు. కార్పొరేట్ ఉద్యోగుల పర్క్స్ విషయంలోనూ భారీ మార్పులు జరిగాయి. కంపెనీలు ఇచ్చే మీల్ వోచర్ల టాక్స్ ఫ్రీ లిమిట్‌ను 50 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. అలాగే కంపెనీలు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని ఏకంగా 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పాన్ కార్డ్‌కు మరింత ప్రాధాన్యత
పాన్ కార్డ్‌కు మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇకపై 50 వేల లోపు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా సరే పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. ఆస్తుల కొనుగోలులో 20 లక్షలు దాటినా, హోటళ్లలో లక్ష రూపాయలు బిల్లు దాటినా పాన్ నెంబర్ తప్పనిసరి.
వాహనదారులకు ఫాస్టాగ్ షాక్
ఇక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ విషయానికి వస్తే వాహనదారులకు ఫాస్టాగ్ షాక్.. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను 3 వేల నుంచి 3,075 రూపాయలకు పెంచారు. ITR-1 , ITR-2 దాఖలు చేసే వ్యక్తులకు జూలై 31 గడువు కొనసాగుతుంది. వ్యాపార సంస్థలు ట్రస్టులు తమ రిటర్న్‌లను ఆగస్టు 31 వరకు దాఖలు చేయొచ్చు. మరోవైపు, కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రాలకు పన్ను ఫలాలు అందుతాయి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
