AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొప్ప మనస్సు చాటుకున్న ముఖ్యమంత్రి.. ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకు అండగా సర్కార్!

అందరి ప్రాణాలు కాపాడే ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకే కష్టమొచ్చింది. ట్యాంక్ బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ దీనస్థితి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున సాయం అందించారు.

గొప్ప మనస్సు చాటుకున్న ముఖ్యమంత్రి.. ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకు అండగా సర్కార్!
Cm Revanth Reddy Assistance To Tank Bund Shiva
Balaraju Goud
|

Updated on: Apr 01, 2026 | 7:42 AM

Share

అందరి ప్రాణాలు కాపాడే ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకే కష్టమొచ్చింది. ట్యాంక్ బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ దీనస్థితి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున సాయం అందించారు. శివ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించడంతో పాటు అతని కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేశారు.

ట్యాంక్ బండ్‌పై ఆత్మహత్యాయత్నం చేసిన ఎంతో మంది ప్రాణాలు కాపాడారు శివ. ఈ మధ్య శివ దీన స్థితి సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారు శివ. అతనికి అవసరమైన సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. అయితే ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేయాలని సూచించారు. ఈ క్రమంలో శివ కుమారుడికి హోంగార్డుగా నియామక పత్రం అందించారు సీఎం. సీఎం చేతులమీదుగా సాయం అందుకోవడం పట్ల శివ, కుటుంబసభ్యుల సంతోషం వ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us