AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : డెబ్యూ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు చుక్కలు.. పాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆసీస్ కుర్రాడు

IPL 2026 : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు కూపర్ కానోలీ అరంగేట్రం మ్యాచ్‌లోనే 72 పరుగులతో వీరవిహారం చేసి గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయాన్ని అందించాడు. అసలు అంచనాలే లేని చోట నుంచి వచ్చి, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

IPL 2026 : డెబ్యూ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు చుక్కలు.. పాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆసీస్ కుర్రాడు
Cooper Connolly
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 7:25 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కేవలం నాలుగు మ్యాచ్‌లే పూర్తయిన ఈ సమయంలో అప్పుడే ఒక కొత్త కుర్రాడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కానోలీ, తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు. అసలు అంచనాలే లేని చోట నుంచి వచ్చి, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ వేసినప్పుడు, ప్లేయింగ్-11లో 22 ఏళ్ల కూపర్ కానోలీ పేరు వినిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఐపీఎల్ కంటే ముందు ఆడిన గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో అతను చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. పైగా అంతర్జాతీయ టీ20ల్లోనూ అతని ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏమీ లేదు. అలాంటి ఆటగాడిని ఏకంగా 3 కోట్ల రూపాయలు పెట్టి పంజాబ్ ఎందుకు కొనుగోలు చేసిందని వేలంలోనే విమర్శలు వచ్చాయి. కోచ్ రికీ పాంటింగ్ కావాలనే తన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఫేవర్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులకు పరిమితమైంది. లక్ష్యం చిన్నదే అయినా, పంజాబ్ రెండో ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. అప్పుడు మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కానోలీపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఒక దశలో కేవలం 16 బంతుల వ్యవధిలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ వంటి దిగ్గజ బౌలర్లు విజృంభిస్తున్న వేళ, గుజరాత్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, కానోలీ మాత్రం పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెటర్లకే ఉండే ఆ పట్టుదలను చూపించాడు. ఎక్కడా భయపడకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కానోలీ, ఆ తర్వాత గేర్ మార్చాడు. కగిసో రబడా లాంటి ఫాస్ట్ బౌలర్లను కూడా లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. చివరికి 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. 19.1 ఓవర్లలోనే పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అనుభవం ఇక్కడ కానోలీకి బాగా ఉపయోగపడింది.

రికీ పాంటింగ్ ఒక ప్లేయర్‌ను నమ్మి తీసుకుంటే అది ఎలా ఉంటుందో కానోలీ నిరూపించాడు. బిగ్ బాష్ లీగ్‌లో గత సీజన్‌లో 229 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి పర్త్ టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కానోలీ కీలక పాత్ర పోషించాడు. అదే నమ్మకంతో పాంటింగ్ ఇతడిని పంజాబ్ టీమ్‌లోకి తెచ్చాడు. తొలి మ్యాచ్‌తోనే తనేంటో నిరూపించుకున్న కానోలీ, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కప్పు కలని నిజం చేసేలా కనిపిస్తున్నాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us