AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్న కొత్త రాజు.. టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే ఫిఫ్టీ బాది రికార్డు సృష్టించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని మైఖేల్ వాన్ కోరుతున్నారు.15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను చూపించిన పరిణితి అమోఘం.

Vaibhav Suryavanshi : ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్న కొత్త రాజు.. టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 7:50 AM

Share

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో మరో సంచలనం ఉద్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 (IPL 2026) వేదికగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు సాధించిన ఈ కుర్రాడి ఆట తీరు చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఫిదా అయిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, తన పార్ట్నర్ యశస్వి జైస్వాల్ కంటే వేగంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో వైభవ్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు, ఇది ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. మొత్తం 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి బలమైన పునాది వేశాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడంలో అతను చూపించిన పరిణితి అమోఘం.

మైఖేల్ వాన్ ఏమన్నారంటే?

వైభవ్ ఆటను చూసిన మైఖేల్ వాన్ క్రిక్ బజ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అతను భారత జట్టులో ఎప్పుడు అరంగేట్రం చేస్తాడు? రాబోయే కొద్ది నెలల్లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ నేను భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌లో ఉంటే, కచ్చితంగా అతడిని ఆ పర్యటనకు తీసుకెళ్తాను. వెంటనే తుది జట్టులో ఆడించకపోయినా, సీనియర్ల మధ్య ఆ వాతావరణంలో ఉండటం అతనికి చాలా అవసరం. 15 ఏళ్ల వయసులో ఇది కొంచెం ముందే అనుకోవచ్చు, కానీ అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు సరిపోయేంత టాలెంట్ ఉన్న పర్సన్ అని నాకు అనిపిస్తోంది” అని వాన్ వకాల్తా పుచ్చుకున్నారు.

అండర్-19 వరల్డ్ కప్ హీరో

వైభవ్ సూర్యవంశీకి ఇది కేవలం ఐపీఎల్ మెరుపు మాత్రమే కాదు. ఇటీవలే జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు ఆరోసారి ప్రపంచకప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం గమనార్హం. గత 12 నెలలుగా దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ జూనియర్ క్రికెట్ వరకు వైభవ్ పరుగుల వరద పారిస్తున్నాడు.

భవిష్యత్తు ఆశాకిరణం

బీహార్‌కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసి అందరినీ అలరించిన వైభవ్, ఈ సీజన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. సెకండ్ సీజన్ సిండ్రోమ్ (రెండో ఏడాది ఫెయిల్ అవ్వడం) అనే భయం లేకుండా, తొలి మ్యాచ్‌లోనే చెన్నైపై విరుచుకుపడటం అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. మైఖేల్ వాన్ చెప్పినట్లుగా, ఈ యువ సంచలనం త్వరలోనే బ్లూ జెర్సీలో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
అర్ధరాత్రి థ్రిల్ కోసం స్పీడ్ రైడ్.. తెల్లారేసరికి బ్రేకింగ్ NEWS
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
భర్త మరణిస్తే భార్య భరణం పొందవచ్చా..?
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
కాశీ-అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. 9 రోజుల్లో 5 పవిత్ర
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు