AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే..

తెలంగాణ ప్రభుత్వం 2026 వేసవి సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Telangana: తెలంగాణలో స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే..
Telangana
Ravi Kiran
|

Updated on: Apr 01, 2026 | 7:28 AM

Share

ఎగ్జామ్స్ చివరి దశకు చేరుకున్నాయ్. స్టూడెంట్స్ అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తీపికబురు వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.

ఇది చదవండి: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజుల వరకు పూజలు చేయకూడదంటే.?

పాఠశాలల పునఃప్రారంభం..

వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల ప్రకటనతో అటు విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు వేసవి ప్రయాణాలకు సిద్దమవుతున్నారు. కాగా, సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. తీవ్రమైన ఎండలు ప్రారంభం కాకముందే సెలవుల తేదీలను ప్రకటించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us