AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chia Seeds: చియా సీడ్స్ వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

నేటి కాలంలో సూపర్ ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి చియా గింజలు. బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు వీటిని అమితంగా ఇష్టపడతారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లకు ఇవి పెట్టింది పేరు. అయితే నాణేనికి రెండో పార్శ్వం ఉన్నట్లు.. చియా గింజలు అందరికీ ఆరోగ్యకరం కావు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Mar 31, 2026 | 8:31 PM

Share
చియా గింజలతో అద్భుత ప్రయోజనాలు: వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభమవుతుంది.

1 / 5
తక్కువ రక్తపోటు ఉన్నవారు: చియా గింజలకు రక్తపోటును తగ్గించే గుణం ఉంది. హైబీపీ ఉన్నవారికి ఇది మేలు చేసినా, ఇప్పటికే లో-బీపీతో బాధపడేవారు వీటిని తీసుకుంటే తల తిరగడం, విపరీతమైన అలసట లేదా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.

2 / 5
కిడ్నీ సమస్యలు ఉన్నవారు: చియా గింజల్లో పొటాషియం, ఫాస్ఫరస్, ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అలాగే శరీరంలో పొటాషియం స్థాయిలు విపరీతంగా పెరిగే హైపర్‌కలేమియా స్థితికి దారితీసే అవకాశం ఉంది.

3 / 5
మందులు వాడేవారు : మీరు రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులు వాడుతున్నట్లయితే, చియా గింజలకు దూరంగా ఉండటం మంచిది. ఇందులోని ఒమేగా-3 యాసిడ్లు మందుల ప్రభావానికి అడ్డుపడి, అధిక రక్తస్రావానికి కారణం కావచ్చు.

4 / 5
జీర్ణకోశ సమస్యలు: కేవలం రెండు చెంచాల చియా గింజల్లోనే 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మంచిదే అయినప్పటికీ ఒక్కసారిగా అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు వీటిని పరిమితంగానే తీసుకోవాలి.

5 / 5
Follow Us
భ్రమల్లో బతుకుతున్నారు.. మెంటల్ ట్రీట్‌మెంట్ అవసరం.. ట్రంప్‌పై..

షోయబ్‌ ఒక్కడే కాదు.. భారతీయ యువతులను పెళ్లాడిన పాక్‌ ప్లేయర్లు

పచ్చి గడ్డితో నడిచే వినూత్న బైక్.. బ్రేకులేని ఈ బండికి హెల్మెట్‌

అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా?
అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా?
కొంపముంచిన ఫోటో..!
కొంపముంచిన ఫోటో..!
పచ్చి కొబ్బరితో అదిరిపోయే కోఫ్తా కర్రీ..ఇంట్లో సులువుగా చేసుకోండి

పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఇజ్జత్ పాయే..!

కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్..

ఒకరు కాదు ముగ్గురు..'ఇరుముడి'ని మిస్ చేసుకున్నస్టార్ హీరోలు వీరే!

అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం..ఎలా చేయాలంటే