AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఒక్క ఓవర్లో 11 బంతులు.. ఐపీఎల్‌లో అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్న పంజాబ్ పేసర్

IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 11 బంతులతో కూడిన సుదీర్ఘ ఓవర్ వేసి రికార్డు సృష్టించాడు. 2023లో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే ఈ ఘనత సాధించగా, 2025 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఇలాగే వేశారు.

IPL 2026 : ఒక్క ఓవర్లో 11 బంతులు.. ఐపీఎల్‌లో అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్న పంజాబ్ పేసర్
Arshdeep Singh
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 8:09 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అంటే కేవలం కూపర్ కానోలీ విధ్వంసకర బ్యాటింగ్ మాత్రమే కాదు, పంజాబ్ స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన ఒక లాంగ్ ఓవర్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక ఓవర్ అంటే ఆరు బంతులు ఉంటాయి. కానీ అర్షదీప్ మాత్రం ఏకంగా 11 బంతులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పి వైడ్లు, నో బాల్స్ వేయడంతో ఈ ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పొడవైన ఓవర్‌గా రికార్డులకెక్కింది.

ఆఖరి ఓవర్లో ఏం జరిగింది?

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ వేసే బాధ్యతను పంజాబ్ కెప్టెన్ అర్షదీప్ సింగ్‌కు అప్పగించాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 150/6. ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తాడనుకుంటే, అర్షదీప్ మొదటి బంతినే వైడ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియాను కట్టడి చేసే క్రమంలో వరుసగా వైడ్లు, నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో తెవాటియా ఒక ఫోర్ కొట్టినా, అర్షదీప్ వేసిన అదనపు బంతులు పంజాబ్ శిబిరాన్ని టెన్షన్ పెట్టాయి. చివరికి ఒక వైడ్ బాల్‌ను డీఆర్ఎస్ ద్వారా అంపైర్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓవర్ 11 బంతుల వద్ద ముగిసింది.

గతంలోనూ ఇలాంటి లాంగ్ ఓవర్లు

అర్షదీప్ సింగ్ ఈ అరుదైన చెత్త రికార్డును సృష్టించిన మొదటి బౌలర్ ఏమీ కాదు. ఐపీఎల్ చరిత్రలో గతంలో ఐదుగురు బౌలర్లు ఒకే ఓవర్లో 11 బంతులు వేసి ఈ జాబితాలో నిలిచారు. 2023లో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే ఈ ఘనత సాధించగా, 2025 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఒకే ఓవర్లో 11 బంతులు వేసి అన్‌వాంటెడ్ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పుడు అర్షదీప్ కూడా ఆ క్లబ్‌లో చేరిపోయాడు.

వైడ్లు, నో బాల్స్ తో తలపోటు

అర్షదీప్ సింగ్ ఒకానొక దశలో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ ఫామ్ కనిపించలేదు. ముల్లాన్‌పూర్ పిచ్‌పై గ్రిప్ దొరక్కపోవడం లేదా తెవాటియా లాంటి ఫినిషర్‌ను చూసి ఒత్తిడికి లోనవ్వడం వల్లనో కానీ, వరుసగా వైడ్లు వేయడం విమర్శలకు దారితీసింది. ఆఖరి ఓవర్లో ఇన్ని ఎక్స్‌ట్రాలు ఇస్తే మ్యాచ్ ఫలితం మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదృష్టవశాత్తూ బ్యాటింగ్ లో కానోలీ మెరవడంతో పంజాబ్ గట్టెక్కింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్