AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాప్ లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి. ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమా అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్దీ సినిమాలు చేసిన అందాల తారలు చాలా మందే ఉన్నారు.

ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2025 | 2:06 PM

Share

కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాడెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్లు , ఖరీదైన వాచ్ లు వాడుతుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుండటంతో.. సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాంతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు.. అయితే ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన నటి ఆమె..

తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే

రోజుకు లక్ష రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుంది. చివరకు అనాధల కన్నుమూసింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసిన అందాల సుందరి సిల్క్ స్మిత.. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, డిస్కో శాంతి లాంటివారికి పోటినిచ్చి.. ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్స్‌లు సంపాదించింది ఈ భామ. ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌కు మించిన క్రేజ్ సిల్క్ స్మితకు ఉండేది అనడంలో ఎలాంటి  అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకునేది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత తర్వాత ఎంతోమంది డ్యాన్సర్లు వచ్చారు.. అయినా ఎవ్వరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్‌ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గతంలో డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు చెప్పింది.‘సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను నేను అక్కా అని పిలిచేదాన్ని. పెళ్లి విషయంలో ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కాలేదు. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. ఆమె భర్త గురించి, అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు లక్ష నుంచి రూ. 3 లక్షలు ఆమె రెమ్యునరేషన్‌గా తీసుకుంది. నెలకు ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది. మేము ఆ స్థాయికి చేరుకునేందుకు పదేళ్లు పట్టింది. అప్పుడప్పుడూ సొంత ఇల్లు కొనుకోవచ్చు కదా అని నేను అడిగేదాన్ని.? ఆమెది చాలా లగ్జరీ లైఫ్. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది. అవకాశాల కోసం తిరిగినప్పుడు.. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే డబ్బులపై పడుకుంటున్నాను అని చెప్పింది. సెట్లలో ప్రతీ ఒక్కరు ఆమెను గౌరవించేవారు’ అని డిస్కో శాంతి తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

Silk Smitha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి