- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine is who has done only four films in Tollywood, She is Nisha Agarwal
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.?
Updated on: Nov 06, 2025 | 1:23 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.?

తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యేరు. ఆమె అక్క ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.

క్రేజీ బ్యూటీ నిషా అగర్వాల్.. ఈ అమ్మడు కాజల్ అగర్వాల్‌కు చెల్లెలు. నిషా తన సినీ ప్రస్థానాన్ని 2010లో తెలుగు చిత్రం ఏమైంది ఈవేళతో ప్రారంభించింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత వరుసగా సోలో , మలయాళంలో ఓ సినిమా, ఇష్టం వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో సుకుమారుడు, డీకే బోస్, కపిన్ బాబు వంటి సినిమాలు కొన్ని ఆమె గుర్తింపు తెచ్చినవి. కానీ ఆతర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే వివాహం చేసుకుంది ఈ అందాల తార. ఇక తల్లిగా బాధ్యతల తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమైంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.