AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ భామ రూటే సపరేటు.. సీనియర్ హీరోలకు ఒకే చెప్తున్న కుర్ర భామ

కుర్ర హీరోలతో పోటీపడుతూ సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నారు సీనియర్ హీరోలు.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలాంటి సీనియర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు.

Rajeev Rayala
|

Updated on: Nov 05, 2025 | 8:47 PM

Share

1 / 5
అయితే సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్స్ దొరకడం ఒకింత కష్టమే.. యంగ్ బ్యూటీ సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆలోచిస్తారు.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్, నాగార్జునలాంటి హీరోలతో చేసింది ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

2 / 5
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్. మంచి అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో నటించింది.

3 / 5
ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఇప్పుడు ఈ ముద్దగుమ్మ ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. విశ్వంభర షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో ఆషిక రంగనాథ్‌ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. రవితేజ  ఇటీవలే మాస్ జాతర సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్‌ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు.

5 / 5