దివ్య.. నాన్న.. ఓ తనూజ..!! కెప్టెన్సీ గంగార్పణం..! వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్ బాస్ దత్తపుత్రిక
బిగ్‌బాస్ సీజన్ 9.. గత వారం రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా సీక్రెట్ టాస్కులు సక్సెస్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరో కొత్త రెబల్ గా రీతూను ఎంపిక చేశాడు బిగ్‌బాస్ . నిన్నటి ఎపిసోడ్ లో ఘోస్ట్ టాస్కులో తనూజ గెలవడంతో రోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీంకు దక్కింది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ టాస్క్ ల్లో మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. ముఖ్యంగా దివ్య-తనూజ మధ్య డైలాగ్ వార్ నడిచింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ మేట్స్ కు ఓ ట్రైన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇప్పటివరకూ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న వారితో కలిపి మిగిలిన అందరూ డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించొచ్చు అని చెప్పాడు. దాంతో డ్రైవర్ సీటు కోసం అందరూ పోటీపడ్డారు. ఫైనల్‌గా దివ్య డ్రైవర్ సీట్ లో కూర్చుకుంది. ముందుగా బజార్ మోగగానే.. ఇమ్మూ డిమాన్ ను ఆపే ప్రయత్నం చేశాడు. మరో వైపు కళ్యాణ్‌ని రీతూ పట్టకొని కింద పడిపోయింది. చివరిగా దివ్య అందరిని నెట్టేసుకుంటూ వెళ్లి సీట్లో కూర్చుంది.
ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
నా సపోర్ట్ ఇమ్మానుయేల్‌కి అని నేను క్లియర్‌గా చెప్పాను.. మీ ముగ్గురిలో ఎవరిని తీస్తే ఇమ్మానుయేల్‌కి ఒక ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో ఆ బేసిస్ మీద నేను తీసుకుంటున్నాను ఇది.. నేను తనూజని తీసేస్తున్నాను. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా.. అని తనూజ అడిగితే అంతే.. అంటూ దివ్య అంది. దీంతో తనూజకి బీపీ తన్నేసింది. నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి.. ఇక్కడ పెట్టొద్దు అంటూ తనుజ గట్టిగానే మాట్లాడింది.
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
పర్సనల్ రీజన్ ఏం చెప్పాను.. అని దివ్య అడిగింది. నీది భరణి సార్‌ది..దాని వల్ల తీసేస్తున్నానని చెప్పు.. నువ్వు ఆ ఛైర్ అడిగినందుకు వాళ్లందరితో నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని మాత్రమే నీకు ఇచ్చారు అంటూ అరిచింది తనూజ. దానికి దివ్య కూల్ గానే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.. ఓన్లీ కళ్యాణ్ అన్నాడు కానీ తర్వాత ఇమ్మానుయేల్‌ని చూస్తే నాకు అనిపించింది.. అని దివ్య చెప్పింది. ఇంతలో దివ్య నీ దగ్గరి నుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు.. నిన్ను నమ్మి నీకు ఇచ్చాను.. అని కళ్యాణ్ అన్నాడు. దాంతో తనూజ మాట్లాడుతూ.. కళ్యాణ్ ఒక్క నిమిషం వింటావా.. ఇక్కడ ఇమ్మానుయేల్ కాదు ఇక్కడ రీతూ కాదు.. కేవలం పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీసేసింది.. అంటూ రెచ్చిపోయింది తనూజ. ఇంతలో దివ్య ఎదో చెప్పబోతుంటే తనూజ వినిపించుకోలేదు.. నీతో నాకు మాట్లాడటం ఇష్టం లేదు.. నాతో మాట్లాడకు.. నీ పర్సనల్ విషయాలు హౌస్ బయట పెట్టుకో లోపల కాదు.. అంటూ లోపలి వెళ్ళిపోయింది. కట్ చేస్తే బెడ్ పై పడుకొని బోరుమని ఏడ్చేసింది తనూజ. దుప్పటి కప్పేసుకొన మరీ ఏడ్చింది తనూజ.
50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
