నాగార్జున నన్ను ఆ పేరు పెట్టుకోమన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన అనుష్క శెట్టి
ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. చాలా కాలం తర్వాత ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ ఇమేజ్ వచ్చాకా మాత్రం అడియన్స్ ఆరాధించే దేవతగా మారింది. దీంతో అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుని.. అద్భుతమైన నటనతో మెప్పించింది. పాత్రకు వెయిట్ ఉంటే చిన్న హీరోలతో సైతం నటించేందుకు రెడీ అయ్యింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది.
ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
మొన్నామధ్య యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత రీసెంట్ గా ఘాటి అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు అనుష్క కల్కి 2లో నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
ఈ వీడియోలో అనుష్క తన పేరు గురించి ఆసక్తికర విషయం చెప్పింది. తన పేరు స్వీటీ శెట్టి అని.. మొదటి సినిమాలో స్వీటీ శెట్టి అనే ఉందని చెప్పింది. అయితే సూపర్ సినిమా కోసం పేరు మార్చుకోవాలని అనుకున్నా.. అప్పుడు మా నాన్న గారు, నాగార్జున గారు స్మృతి శెట్టి అనే పేరు పెట్టుకోమన్నారు. కానీ ఆ పేరు నాకు నచ్చలేదు.. ఆ పేరు పలికేటప్పుడు ముక్కు దగ్గరిగా వెళ్తుంది.. దాంతో నాకు నచ్చలేదు.. అనుష్క పేరు కూడా నాకు నచ్చలేదు. కానీ ఎంతమందికి తమ పేరును తామే మార్చుకునే అదృష్టం కలుగుతుంది.. చెప్పండి. ఇక ఫైనల్ గా అనుష్కగా పిక్స్ అయ్యాం.. అలా అనుష్క శెట్టి అయ్యింది అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
