AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దలను ఎదిరించి పెళ్లాడింది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు మరో వ్యక్తితో.. ఈ హీరోయిన్ ఎవరంటే..

కారణాలేవైనా గానీ సినిమా ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణమైపోయాయి. మూడుముళ్ల బంధం కేవలం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోతుంది. ఎన్నో ఏళ్ల పాటు కాపురం చేసి, పిల్లల్ని కని ఆదర్శంగా కనిపించిన జంటలు కూడా అనూహ్యంగా విడిపోతున్నాయి. విడాకుల కోసం కోర్లు మెట్లెక్కుతున్నాయి .

పెద్దలను ఎదిరించి పెళ్లాడింది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు మరో వ్యక్తితో.. ఈ హీరోయిన్ ఎవరంటే..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2025 | 3:01 PM

Share

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో హీరోయిన్‌గా ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి సినిమాలు దూరం అయ్యింది. నటనకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్ముడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఉదయ్ కిరణ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఆ సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. చేసింది కొన్ని సినిమాలే కానీ ఇప్పటికీ కుర్రాళ్ళ గుండెల్లో చేరగని ముద్ర వేసింది. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్  హిందీలోనూ నటించి ఆకట్టుకుంది.

తెలుగులో ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకు ఆమె ఎవరంటే ఆమె పేరు అనిత హస్సానందని. తేజ దర్శకత్వంలో 2001లో విడుదలైన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత హస్సానందని. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీగా నిలిచింది నువ్వు నేను సినిమా. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నువ్వు నేను సినిమా తర్వాత మరోసారి ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ సినిమాలో నటించింది. సినిమాలతో పాటు టెలివిజన్ లోనూ అనిత మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిత తన లవ్ స్టోరీని, అలాగే బ్రేకప్ గురించిన విషయాలను పంచుకుంది. గతంలో అనిత ఎజాజ్‌ ఖాన్ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. దీని గురించి అనిత మాట్లాడుతూ.. “నా జీవితంలో ఉన్న కొన్ని శాశ్వత సంబంధాలలో ఒకటి ఎజాజ్‌తో.. నేను నా తల్లికి వ్యతిరేకంగా వెళ్లి అతనిని ప్రేమించాను. అతను వేరే మతానికి చెందినవాడు కాబట్టి మా సంబంధాన్ని మా అమ్మ వ్యతిరేకించింది. అతను ముస్లిం, నేను హిందువును. అతను నన్ను ఎప్పుడూ నేరుగా తిరస్కరించలేదు. కానీ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. కానీ మా సంబంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను. ఆ సమయంలో నేను ప్రేమించిన వ్యక్తి కోసం నేను పూర్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు బాధపడుతున్నాను. వాటన్నింటినీ అధిగమించడానికి నాకు ఏడాది పట్టింది. నేను చాలా ఒంటరిగా ఫీలయ్యాను. మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించే వారితో ఎప్పుడూ ఉండకూడదనేది చాలా ముఖ్యమైన విషయం. వారి ఫోన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య. వ్యక్తి తన ఫోన్‌ను దాచిపెడితే, ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడని అర్ధం. “ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబం ,స్నేహితుల  నుంచి దూరం చేయకూడదు అని అనిత చెప్పుకొచ్చింది. ఇక 14 అక్టోబర్ 2013న అనిత గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని రెండో వివాహం చేసుకుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us