Sai Pallavi: నాగార్జున గురించి తాతయ్య చెప్పిన మాటలకు షాకయ్యాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన సాయి పల్లవి..
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో లవ్ స్టోరీ చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌ను హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సెలబ్రెట్ చేశారు. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే సాయి పల్లవి, నాగచైతన్య, శేఖర్ కమ్ముల కూడా ఈ వేడుకలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి నాగార్జున గురించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
లవ్ స్టోరీ సక్సెస్ మీట్ వేడుకలో సాయి పల్లవి మాట్లాడుతూ.. మా సక్సె్స్ మీట్‌కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థ్యాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలి అనుకున్నాను. కానీ రాలేదు. మా తాతయ్య అన్నమయ్య సినిమా వందసార్లు చూసి ఉంటారు. ఆయనతోపాటు మేము చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను.. కానీ తాతయ్య అన్నారు.. ఇప్పుడు నటిస్తుండొచ్చు, కానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్‌గా ఉండాలని టీం మొత్తం పాటించాం. ఈ సినిమా ద్వారా శేఖర్ గారు అమ్మాయి తరుపున నిలబడి ఫైట్ చేశారు. సినిమా మేకింగ్‌లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరీ మ్యాజిక్ చేసింది. నిర్మాతలకు థ్యాంక్స్. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరీతో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకు ఒక ధైర్యాన్ని ఈ సినిమా ఇచ్చిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
Also Read: Samantha: అవన్నీ పుకార్లే.. హైదరాబాదే నాకు ఇల్లు, అన్నీ ఇచ్చింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తనకు అంతా షాక్.. దండం పెట్టిన లోబో..