AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అవన్నీ పుకార్లే.. హైదరాబాదే నాకు ఇల్లు, అన్నీ ఇచ్చింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: గతకొన్ని రోజులుగా సమంత చుట్టూ వార్తలు పుకార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా సమంత..

Samantha: అవన్నీ పుకార్లే.. హైదరాబాదే నాకు ఇల్లు, అన్నీ ఇచ్చింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Narender Vaitla
|

Updated on: Sep 29, 2021 | 8:13 AM

Share

Samantha: గతకొన్ని రోజులుగా సమంత చుట్టూ పుకార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా సమంత భరణం కింద రూ. 250 కోట్లు అడుగుతోంది అంటూ రకరకలా వార్తలు హల్చల్‌ చేస్తూనే ఉన్నాయి. అయితే సామ్‌ మాత్రం వీటిపై స్పందించకుండా తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఇక మరోవైపు నాగచైతన్య కూడా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయమై సమంత కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. సమంత సొంత దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ ఏర్పాటు చేసి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత చిన్నపాటి వేడుకలు నిర్వహించింది. అలాగే ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తానని ముందస్తుగానే ఓ పోస్ట్‌ చేసిన సామ్‌.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగిన ప్రశ్నకు ఓపికతో బదులిచ్చింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీరు నిజంగా ముంబయికి వెళ్తున్నారా.?’ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిచ్చిన సమంత.. ‘అసలు ఈ రూమర్‌ ఎక్కడ మొదలైందో తెలియడం లేదు. కానీ వందల రూమర్లలాగే ఇది కూడా ఒక రూమర్‌ మాత్రమే. హైదరాబాదే నా ఇల్లు. హైదరాబాద్‌ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. దీంతో సామ్‌చైల వైవాహిక జీవితంపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పడినట్లు అయ్యిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

అయితే నాగచైతన్య లవ్‌స్టోరీ ప్రీరిలీజ్‌ ఈవెంట్, సక్సెస్‌ మీట్‌కు హాజరుకాకపోవడం, తన బ్రాండ్‌ మొదటి వార్షికోత్సవానికి కుటుంబ సభ్యులు లేకపోవడం ఇలా ఎన్నో అంశాలు ఇంకా అనుమానాలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ఓ క్లారిటీ రావాలంటే సమంత, నాగచైతన్యల పెళ్లి రోజైన అక్టోబర్‌ 7వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Bigg Boss 5 Telugu: ఆమెను నాకు గర్ల్‏ఫ్రెండ్ చేయండి.. మాకు రోమాంటిక్ సాంగ్ ప్లే చేయండి.. బిగ్‏బాస్‏కు జెస్సీ విజ్ఞప్తి..  యేశాలు మాములుగా లేవు..

Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే..

Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..