AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Sonu Sood Free ENT: కరోనా సమయంలో వలస కూలీలు దిక్కుతోచని ఉన్న పరిస్థితుల్లో తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు నటుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేదంటూ సాయం చేస్తూ కలియుగ..

Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..
Narender Vaitla
|

Updated on: Sep 29, 2021 | 6:30 AM

Share

Sonu Sood Free ENT: కరోనా సమయంలో వలస కూలీలు దిక్కుతోచని ఉన్న పరిస్థితుల్లో తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు నటుడు సోనూసూద్‌. అడిగిన వారికి లేదంటూ సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఎవరూ ఏ సాయం అడిగినా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉచితంగా అంబులెన్స్‌ల నుంచి ఐఏఎస్‌, సీఏ, లా కోచింగ్‌లను అందిస్తూ వస్తున్నారు సోనూసూద్‌. ఇదిలా ఉంటే సేవ కార్యక్రమాల్లో తాజాగా సోనూ మరో అడుగు ముందుకేశారు. ఈసారి ఏకంగా ఉచితంగా ఈఎన్‌టీ సర్జరీలను అందించనున్నారు. ‘సోనూ ఛారిటీ ఫౌండేషన్‌’ ద్వారా ఈ సేవలు అందించనున్నట్లు సోనూసూద్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

ఈ సందర్భంగా సోనూ పోస్ట్‌ చేస్తూ.. ‘ఈఎన్‌టీ సర్జరీలను ఉచితంగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇకపై.. వాసన, రుచి, శబ్దం చక్కగా ఆస్వాదిద్దాం’ అనే క్యాప్షన్‌ జోడించారు. అంతేకాకుండా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు.

ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే..

* ముందుగా www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి. * అనంతరం ఓపెన్‌ అయిన పేజ్‌లో ఉచితంగా అందించే ఈఎన్‌టీ సర్జరీలకు సంబంధించి వివరాలు ఉంటాయి. * తర్వాత రిజిస్టర్‌ ఆప్షన్‌ లేదా బార్‌కోడ్‌ స్కాన్‌ చేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫామ్ ఓపెన్‌ అవుతుంది. * అన్ని వివరాలు ఎంటర్‌ చేసిన సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Also Read: Flights: విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే!

Anandaiah: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. కృష్ణపట్నం ఆనందయ్య కొత్త పార్టీ.. భారీ స్కేచ్‌..!

IPL 2021, MI Vs PBKS Match Result: ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. తివారి, హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్

రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వన్డే క్రికెట్‌లో అధిక సింగిల్స్ తీసిన టాప్ బ్యాట్స్‌మెన్ వీళ్లే
వన్డే క్రికెట్‌లో అధిక సింగిల్స్ తీసిన టాప్ బ్యాట్స్‌మెన్ వీళ్లే
రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు
రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు