AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆమెను నాకు గర్ల్‏ఫ్రెండ్ చేయండి.. మాకు రోమాంటిక్ సాంగ్ ప్లే చేయండి.. బిగ్‏బాస్‏కు జెస్సీ విజ్ఞప్తి..  యేశాలు మాములుగా లేవు..

బిగ్‏బాస్ ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీలు.. గొడవలతోనే సాగిపోతుంది. ఇద్దరు సభ్యుల మధ్య లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తున్న బిగ్‏బాస్‏కు

Bigg Boss 5 Telugu: ఆమెను నాకు గర్ల్‏ఫ్రెండ్ చేయండి.. మాకు రోమాంటిక్ సాంగ్ ప్లే చేయండి.. బిగ్‏బాస్‏కు జెస్సీ విజ్ఞప్తి..  యేశాలు మాములుగా లేవు..
Jessie
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2021 | 7:57 AM

Share

బిగ్‏బాస్ ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీలు.. గొడవలతోనే సాగిపోతుంది. ఇద్దరు సభ్యుల మధ్య లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తున్న బిగ్‏బాస్‏కు సరైన జోడి దొరికినట్టుగా లేదు. అందుకే అప్పుడుడప్పుడు చిన్నగా.. లవ్ ట్రాక్ నడుస్తున్నాయంటూ హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇంటి సభ్యులు కూడా హమిదా, శ్రీరామ్, మానస్ అంటూ ఏవేవో మాటలు చెబుతున్నారు. అయితే మొదటి నుంచి మోడల్ జెస్సీని అందరూ చిన్నపిల్లాడిగానే చూడడం.. తన వయసుకు దగ్గరగా ఉన్న అమ్మాయి ఇంట్లో లేకపోవడంతో… మొదటి నుంచి సింగిల్‏గానే ఉంటున్నాడు జెస్సీ. ఇక షణ్ముఖ్ ఎక్కువగా సిరితో కనిపించడం.. ప్రియాంక మానస్‏కు లైక్ చేయడం.. ఇక నిజంగానే వీరిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు హమిదా, శ్రీరామ్.. అయితే తనకు గర్ల్ ఫ్రెండ్ కావాలని బిగ్ బాస్‏కు రిక్వెస్ట్ చేశాడు జెస్సీ. నిన్నటి ఎపిసోడ్‏లో తనకు గర్ల్ ఫ్రెండ్‏గా శ్వేతను సెట్ చేయాలని కోరాడు.

బిగ్ బాస్ ఇప్పటివరకు మూడు వారాలు పూర్తిచేసుకుని నాలుగో వారానికి చేరుకుంది. దీంతో టాస్కులపై దృష్టి పెట్టాడు బిగ్ బాస్. ఇంట్లో వాళ్లకు కొత్త టాస్కులు పెడుతూ.. వాళ్లను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. తింటున్న తిండిని సైతం లాక్కున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే.. మొదటటి నుంచి ఇంట్లో జెస్సీని చిన్న పిల్లాడిగానే చూస్తున్నారు. స్కూల్ నుంచి నేరుగా వచ్చాడేమో అంటూ ఆటపట్టిస్తున్నారు. ఇక గతవారం నామినేషన్స్ ప్రక్రియలోనూ చిన్నపిల్లాడివి.. ఏం తెలియదు.. ఎవరు ఏం చెప్పిన అదే చేస్తావ్ అంటూ నటరాజ్ మాస్టర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తను చిన్నపిల్లాడిని కాదని.. తనకు అన్ని తెలుసని.. ఒకరు చెబితే విననని వాదించాడు జెస్సీ.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీశాడు. తనకు శ్వేతను గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేయాలని కోరాడు. తన పక్కన కూర్చుని పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. శ్వేతను తన గర్ల్ ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ ఇవ్వాలని బిగ్ బాస్‏ కు విజ్ఞప్తి చేశాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఓ రోల్ పెట్టండి. మనోహర.. మనోహర అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి అంటూ బిగ్ బాస్‏ను కోరాడు. దీంతో జెన్సీ ప్రవర్తనకు పక్కనే ఉన్న శ్వేత పడి పడి నవ్వింది. అంతకుముందు… మనసులో ఉన్న మాటలను బయటపెట్టాలని నాగార్జున అడగ్గా.. అంత తొందరగా ఎంగేజ్ ఎందుకు అయ్యావని ప్రశ్నించి సిరికి జలక్ ఇచ్చాడు జెస్సీ.

Also Read: Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తనకు అంతా షాక్.. దండం పెట్టిన లోబో..

Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే..

Prabhas: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌.. సలార్‌ బడ్జెట్‌లో సగం అందుకే ఖర్చు చేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.