AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌.. సలార్‌ బడ్జెట్‌లో సగం అందుకే ఖర్చు చేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.

Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ చూపు అటువైపు పడుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సొంతం కాదు, అతనో పాన్‌ ఇండియా..

Prabhas: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌.. సలార్‌ బడ్జెట్‌లో సగం అందుకే ఖర్చు చేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.
Narender Vaitla
|

Updated on: Sep 29, 2021 | 6:55 AM

Share

Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ చూపు అటువైపు పడుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సొంతం కాదు, అతనో పాన్‌ ఇండియా హీరో. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలు సైతం అదే స్థాయిలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఎలాగో పెట్టిన పెట్టుబడి కచ్చితంగా వస్తుందన్న ధీమాతో భారీగా బడ్జెట్‌ పెట్టడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌తో ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రశాంత్‌ కూడా ఇందుకు తగ్గట్లుగానే సలార్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు.

దాదాపు రూ. 250 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు ఢోకా లేదని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం యాక్షన్‌ సన్నివేశాలకే ఖర్చు చేస్తున్నారంటా. అంటే దీనిబట్టే ప్రభాస్‌ను ప్రశాంత్‌ ఏ రేంజ్‌లో చూపించనున్నాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం యాక్షన్‌ సన్నివేశాలే కాకుండా సినిమా చిత్రీకరణలో అత్యున్నత సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారని సమాచారం.

మ్యాట్రిక్స్‌, బ్యాట్‌ మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను ‘సలార్‌’కోసం ఉపయోగిస్తున్నారని టాక్‌. మరి ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రభాస్‌ ఇమేజ్‌ను ఏ రేంజ్‌కు తీసుకుపోతుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’తో పాటు బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కిస్తోన్న ‘ఆది పురుష్‌’లో నటిస్తున్నారు. వీటి తర్వాత మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్‌తో ఓ సినిమా చేయనున్నారు.

Also Read: Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Pawan Kalyan: వరుస ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మరొకటి..

Love Story : ఒక పాత్ర చేస్తే అది మనసులో ఉండిపోవాలి.. అలాంటి సినిమానే ఇది: సాయి పల్లవి