AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story : ఒక పాత్ర చేస్తే అది మనసులో ఉండిపోవాలి.. అలాంటి సినిమానే ఇది: సాయి పల్లవి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.. కరోనా తర్వాత విడుదలైన సినిమాల్లో లవ్ స్టోరీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

Love Story : ఒక పాత్ర చేస్తే అది మనసులో ఉండిపోవాలి.. అలాంటి సినిమానే ఇది: సాయి పల్లవి
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2021 | 9:19 PM

Share

Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.. కరోనా తర్వాత విడుదలైన సినిమాల్లో లవ్ స్టోరీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘ఒక పాత్ర చేస్తే అది మనసులో ఉండిపోవాలి.. అలాంటి పాత్రే నాకు లవ్ స్టోరీ సినిమాలో దొరికింది. అలాగే చాలా ఏళ్లుగా నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం… నాగార్జునతో నాకు కనెక్షన్  ఉంది. ఎలా అంటే నా తాత మీ పెద్ద అభిమాని … అన్నమయ్య అతను 100 సార్లు చూశారు అని అంది. అలాగే లవ్ స్టోరీ సినిమా నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా. ప్రతి అమ్మాయి ఈ సినిమా తప్పక చూడాలి..  సినిమాలో సందేశం చాలా  కీలకమైనది అని చెప్పుకొచ్చింది.

అలాగే నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్ మరణాలు లేవు.. కోవిడ్ సమయంలో ఏపీ తెలంగాణ సీఎంలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు ప్రజల కోటి నమస్కారాలు.. సినిమాలను ఆదరిస్తున్నారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీ అనేది ఒక పెద్ద బెంచ్ మార్క్. ఇది గొప్ప విజయం. ప్రతి ఫిల్మ్ మేకర్ సక్సెస్ ఫుల్ అనిపిస్తుంది. అలాగే చైతన్యతో నాగ్ మాట్లాడుతూ.. నువ్వు నన్ను నవ్వించావ్.. నువ్వు నన్ను ఏడిపించావు .. అన్నారు.  శేఖర్ కమ్ముల మీరు నా కొడుకును స్టార్ యాక్టర్‌గా చేసారు.. నాకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు. నేను తెలంగాణ ఇంకా ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.. మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలను ఆదరించాలని కోరుతున్నాను. అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anu Emmanuel: అను ఇమ్మాన్యువేల్ నాజూకు అందాలకు ఫిదా అవుతున్న ఫాన్స్.. ఫొటోస్ వైరల్

Meenakshi Chaudhary: అందాలు ఆరబోస్తున్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ..

Posani Krishna Murali: పోసాని పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్.. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు..