Posani Krishna Murali: పోసాని పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్.. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు..
పవన్ వ్యాఖ్యలపై పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.. దాంతో పవన్ ఫ్యాన్స్ పోసానిని టార్గెట్ చేసి అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Posani Krishna Murali: పవన్ వ్యాఖ్యలపై పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.. దాంతో పవన్ ఫ్యాన్స్ పోసానిని టార్గెట్ చేసి అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోసాని పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ స్టేట్ ఇంచార్జ్ శంకర్ గౌడ్ . ఎందుకింత ఆగ్రహం..? పోసానికి పట్టలేనంత కోపం ఎందుకు వచ్చింది? పవన్, పోసాని మధ్య వివాదం ఏంటి? ఎక్కడ మొదలైంది..ఎలాంటి టర్న్ తీసుకుంది ఓ సారి చూద్దాం… రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్. పవన్ చీఫ్‌గెస్ట్. ఆ వేదికపై నుంచి ఓ రేంజ్‌లో పంచ్‌లు గుప్పించారు. సినిమా ఫంక్షన్ కాస్తా… పొలిటికల్ సభగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, జగన్‌ను టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేశారు. కొన్ని అభ్యంతరక పదాలు కూడా వాడారు.. సీన్ కట్ చేస్తే…
పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంచ్ టూ ఇంచ్ పంచ్ టూ పంచ్ హైవోల్టేజ్ సమాధానాలు ఇచ్చారు. ఇది ఒక పార్ట్. తర్వాత ఇదే ఎపిసోడ్‌లోకి పోసాని ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మూవీ మరో రేంజ్‌కు వెళ్లింది. తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. వైసీపీ గ్రామసింహాలు అంటూ సెటైర్లు పేల్చారు.. అటు నుంచి కూడా అదే రేంజ్‌లో ట్వీట్లు. కాసేపు సీన్ ట్విట్టర్‌కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత సీన్‌లోకి పవన్ ఫ్యాన్స్ వచ్చారు. అప్పుడే ఈ మూవీలో ఇంటర్వేల్ బ్యాంగ్ రేంజ్ ట్విస్ట్ వచ్చింది.
ట్వీట్లు, మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో రెచ్చిపోయారు పవన్ ఫ్యాన్స్. పర్సనల్ విషయాలనూ టచ్ చేశారు. అంతే పోసానికి కోపం నశాలానికి అంటింది. మళ్లీ ప్రెస్‌ముందుకు వచ్చారు. ఈసారి మరింత రెచ్చిపోయారు. బూతుకథా చిత్రమ్ చూపెట్టారు. ప్రెస్ మొత్తం బీప్ సౌండ్‌లతో రీసౌండ్ వచ్చింది. ఆ తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర హై వోల్టేజ్ టెన్షన్. యుద్ధవాతావరణం కనిపించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :