Posani Krishna Murali : పిచ్చి పిచ్జి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. పోసానికి పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..

పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైకోలుగా ప్రవర్తిస్తున్నారంటూ పోసాని విమర్శలు చేశారు

Posani Krishna Murali : పిచ్చి పిచ్జి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. పోసానికి పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..
Posani Krishna Murali
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైకోలుగా ప్రవర్తిస్తున్నారంటూ పోసాని విమర్శలు చేశారు. పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. పోసాని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. పోసాని ప్రెస్ మీట్‌‌ను అడ్డుకునేందుకు అభిమానులు ప్రయత్నించారు. దాంతో గందరగోళం నెలకొంది. ఫాన్స్ పోసాని పై దాడి చేసేందుకు ప్రయతించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోసానిని జాగ్రత్తగా పోలీసులు కారులోకి ఎక్కించి ఇంటికి పంపించారు. అలాగే రేపు పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పోసాని తెలిపారు. తనకు ఎలాంటి హాని జరిగిన దానికి పవన్ కళ్యాణ్ దే బాధ్యత అని పోసాని అన్నారు.

నిన్న (27న ) పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇచ్చారు. దాంతో పోసాని కుటుంబసభ్యుల పై పవన్ అభిమానులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని ఆయన తెలిపారు. దాంతో ఆయన నేడు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ను.. ఆయన అభిమానులను విమర్శించారు. ప్రెస్ క్లబ్ బయట జనసేన కార్యకర్తలు,  పవన్ అభిమానులు ఆందోళ చేపట్టారు. ‘పవన్ కళ్యాణ్ సైకో కాదు, పోసాని కృష్ణ మురళి సైకో.. పిచ్చి పిచ్జి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు’ అంటూ హెచ్చరిస్తున్నారు అభిమానులు. ఆందోళన చేస్తున్న ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు కొందరిని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puri Jagannadh Birthday: గోవాలో పూరి జగన్నాథ్ బర్త్‌డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

Posani Krishna Murali : పవన్‌ కల్యాణ్‌ను కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించారు.. అప్పుడు పవన్ ఫ్యాన్స్‌ ఏం చేశారు..?-పోసాని

Samantha: ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’… వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్