AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’… వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్

సమంత ప్రజంట్ సినిమాల విషయంలో దూసుకుపోతోంది. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌‌లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది.

Samantha: 'సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు'... వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్
Samantha
Ram Naramaneni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Share

సమంత ప్రజంట్ సినిమాల విషయంలో దూసుకుపోతోంది. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌‌లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగలోనూ తన మార్క్ చూపిస్తోంది. ‘సాకీ’ పేరుతో ఆమె ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది సరిగ్గా ఈ రోజే (సెప్టెంబర్ 28) ఉదయం 9 గంటల 35 నిమిషాలకు ‘సాకీ’  పేరుతో వస్త్ర వ్యాపర రంగంలోకి అడుగుపెట్టింది.  అయితే నేటితో ఈ సాకీ ప్రపంచం మొదలై వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. దీంతో సామ్ ఎంతో ఆనందపడుతూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ పెట్టింది.

”గతేడాది ప్రేమను కురిపించిన సాకీ కుటుంబానికి ధన్యవాదాలు. ఈ అసాధారణమైన ప్రయాణానికి కృతజ్ఞతలు. మున్ముందు మరిన్ని అనుభూతులు కలిసి పంచుకుందాం” అని సదరు పోస్ట్‌కు ట్యాగ్ లైన్ ఇచ్చింది సమంత. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్, పాలోవర్స్ సామ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

సమంత నటనకు షాహిద్ ఫిదా

టాలీవుడ్ హీరోయిన్ సమంతపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌. సోమవారం ట్విటర్‌లో లైవ్‌ సెషన్‌ నిర్వహించి ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు ఈ హీరో.. ఈ సందర్భంగా తనకి అభిమానుల నుంచి ఎదురైన ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ గురించి ఓ అభిమాని ప్రస్తావించాడు. దీనిపైన షాహిద్ మాట్లాడుతూ… ఈ వెబ్ సిరీస్ తనకి ఎంతో నచ్చిందని.. ముఖ్యంగా సమంత నటనకి ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు తనతో, తన నటనతో లవ్ పడిపోయానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆమెతో నటించాలనే ఇంట్రస్ట్ పెరిగిందని, ఆమెతో కలిసి ఓ మూవీ చేయడం తనకు కల అని వెల్లడించాడు.

Also Read: కడుపులో కవలలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వెంటాడిన విషాదం.. ఆ కుటుంబంలో తీవ్ర దు:ఖం