Bigg Boss 5 Telugu: విచిత్రమైన టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. అష్టకష్టాలు పడుతున్న కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది.. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో ఫన్ రెట్టింపు కనిపిస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో ఏకంగా 19మందిని హౌస్‌లోకి పంపించారు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది.. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో ఫన్ రెట్టింపు కనిపిస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో ఏకంగా 19మందిని హౌస్‌లోకి పంపించారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.. మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఆ తర్వాత రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడవ వారంలో లహరి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక నిన్న నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
ఇక నేటి ఎపిసోడ్ సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శ్వేతవర్మతో పులిహోర కలుపుతూ కనిపించదు జెస్సీ. ఆ తర్వాత అలాగే ఇంటిసభ్యులంతా జంటలుగా విడిపోవాలని సూచించాడు బిగ్ బాస్. దాంతో శ్రీరామ్-హమీద , షణ్ముఖ్ – సిరి జంటలుగా మారారు. అలాగే రవి దగ్గరకు వెళ్లి అయిపోయిందేదో అయిపోయింది ఇక వదిలేయ్ అంటూ ప్రియా అన్నా కూడా రవి వినిపించుకోలేదు.. అలాగే ఇంటిసభ్యులకు వీలైనంత బరువు తగ్గాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో హౌస్ మేట్స్ అంతా కష్టపడ్డారు. ఆతర్వాత ఒక్కక్కరి దగ్గర నుంచి ఒకొక్క వస్తువులు తీసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్.. చివరిలో నటరాజ్ మాస్టర్ గట్టిగా అరుస్తూ కనిపించాడు.. దాంతో ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఇక్కడ చదవండి :