Adire Abhi Movie Record: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జబర్ధస్త్ కమెడియన్ సినిమా..!(వీడియో)
నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ అందుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇక జబర్ధస్త్ కమెడియన్స్ కూడా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్నారు.
నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ అందుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇక జబర్ధస్త్ కమెడియన్స్ కూడా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మరో జబర్ధస్త్ కమెడియన్ హీరోగా మారారు. గతంలో నటుడు అదిరే అభి.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు హీరోగా మారారు.. అదిరే అభి ప్రధాన పాత్రలో వైట్ పేపర్ అనే సినిమా రూపొందుతోంది. శివ దర్శకత్వంలో జి.ఎస్.కె. ప్రొడక్షన్స్ పతాకంపై గ్రంథి శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25 అదిరే అభి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ గాయకుడు మనో, నటులు అనసూయ, ఇంద్రజ ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయాలనే ఆసక్తి కలిగిందని, 9 గంటల 51 నిమిషాల్లోనే షూటింగ్ పూర్తి చేయాలన్న ఆయన డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు హీరో అభి. అనుకున్నట్టుగానే నిర్ణీత సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసామని, విడుదలకి ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సినిమా చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అభి నటించకపోతే ఈ సినిమా ఉండేది కాదు.. అవార్డూ వచ్చేది కాదేమో. సినిమాను ఒక్క రోజులో ఎలా తీయగలవని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అభి ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు డైరెక్టర్ శివ.
మరిన్ని చదవండి ఇక్కడ : Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )
Eiffel Tower video: ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయకూడదా..? ఎందుకో తెలుసా..?(వీడియో)
పవన్ కళ్యాణ్ పారితోషికంపై పోసాని సంచలన కామెంట్స్| Posani Vs Pawan Kalyan
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

