Rambha: ఆ విషయంలో భర్తను దూరం పెట్టిన రంభ.. ఈ టాలీవుడ్ హీరోయినే కారణమట

ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్వించింది క్రేజీ బ్యూటీ రంభ . ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Rambha: ఆ విషయంలో భర్తను దూరం పెట్టిన రంభ.. ఈ టాలీవుడ్ హీరోయినే కారణమట
Ramba
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2024 | 7:08 PM

ఒకప్పుడు అందాల తార రంభ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. నటనతోనే కాదు అందంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అందాల తార రంభ. ఈ బ్యూటీని దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు . ఆతర్వాత ఈ చిన్నది వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణించింది. రంభ ఈ ముద్దుగుమ్మ అందనికి కుర్రకారు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంది రంభ. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.

తన భర్తను సోషల్ మీడియాలో ఫాలో అవ్వను అని రంభ తెలిపింది. అది కూడా ఓ స్టార్ హీరోయిన్ వల్ల అని చెప్పుకొచ్చింది. ఓ స్టార్ హీరోయిన్ వల్ల తన భర్తను అన్ ఫాలో చేశాను అని తెలిపింది రంభ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్తను ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో కొట్టాను అని తెలిపింది. కారణం ఆయన మిల్కీ బ్యూటీ తమన్నాను ఫాలో అవుతాడట. అందుకే తన భర్తను ఫాలో అవ్వడం లేదు అని రంభ సరదాగా అన్నారు.

View this post on Instagram

A post shared by Cineulagam (@cineulagamweb)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.