Actress Pragathi: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన నటి ప్రగతి.. జాతీయ పోటీల్లో కాంస్యం కైవసం.. ప్రముఖల ప్రశంసలు
సినిమాల్లో బిజిబిజీగా ఉండే ప్రగతి ఫిట్ నెస్ కోసం లేదా ఏదో సరదాకి వీటిని పోస్ట్ చేస్తుందనుకున్నారు చాలామంది. అయితే కొన్ని నెలల క్రితం ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారామె. ఇప్పుడీ ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు ప్రగతి. బెంగళూరు వేదికగా జరిగిన 28వ పురుషులు, మహిళల నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తల్లి, వదిన, అక్క లాంటి స్పెషల్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది నటి ప్రగతి. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆమె కూడా ఒకరు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటిస్తోందామె. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ప్రగతి తన జిమ్ వీడియోలను అందులో పోస్ట్ చేస్తుంటారు. కఠిన మైన వర్కవుట్లు, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. అయితే సినిమాల్లో బిజిబిజీగా ఉండే ప్రగతి ఫిట్ నెస్ కోసం లేదా ఏదో సరదాకి వీటిని పోస్ట్ చేస్తుందనుకున్నారు చాలామంది. అయితే కొన్ని నెలల క్రితం ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారామె. ఇప్పుడీ ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు ప్రగతి. బెంగళూరు వేదికగా జరిగిన 28వ పురుషులు, మహిళల నేషనల్ లెవెల్ ‘బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో ఈ సీనియర్ నటి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నారు. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు సంబంధించిన ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రగతి తన పవర్ లిఫ్టింగ్ ప్రయాణంపై ఎమోషనల్ అయ్యారు. ‘నా లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. చెడు నిర్ణయాలు, హార్ట్ బ్రేక్స్ తో జీవితం ముగిసిపోయిందని చాలా సార్లు భావించాను. అయితే ఇలాంటివి నాకు ఉత్సాహాన్నిస్తాయి. కొత్త జీవితంపై ఆశలు పెంచుతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలన్నది జీవితానికి విజయ మంత్రం’ అని ఆనందానికి అక్షర రూపమిచ్చారు ప్రగతి
ప్రస్తుతం ప్రగతి షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ సీనియర్ నటీమణిని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆ మధ్యన ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలపై ప్రగతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది డీజే టిల్లు, ఎఫ్ 3, గాడ్ ఫాదర్, స్వాతిముత్యం వంటి హిట్ సినిమాల్లో నటించారు ప్రగతి. చివరిగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిశారు. అలాగే తమిళ్ లో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన భగీరా మూవీలోనూ ఓ ప్రధాన పాత్రలో కనిపించారు.
కాంస్య పతకం అందుకుంటోన్న నటి ప్రగతి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..