- Telugu News Photo Gallery Cinema photos Versatile performance 2023 Movies creates record in Tollywood Telugu Entertainment Photos
Tollywood: సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ కి ఫుల్ మార్క్స్..! పుష్ప నుండి వీరసింహారెడ్డి వరకు..
ట్రెమండస్ ఫైట్లు, కలర్‌ఫుల్ పాటలు, వండర్‌ఫుల్ కామెడీ, అట్రాక్టివ్ జోడీ ఉంటే పక్కా కమర్షియల్ సినిమాను ఫిక్స్ చేసేయొచ్చు అనుకునే రోజులు ఇప్పుడు లేవు. ఫైట్లుండాలి. పాటలుండాలి. ఆన్‌స్క్రీన్ బెస్ట్ పెయిర్ ఉండాలి.. వీటన్నిటి కన్నా ముందు ఇంకోటి ఉండి తీరాలంటున్నారు స్టార్లు. ఆ ఇంకోటి ఏంటి? అనేనా మీ డౌట్.. డీటైల్డ్ గా మాట్లాడేసుకుందాం వచ్చేయండి. | పుష్ప చూసిన వాళ్లందరికీ, ఆ సినిమా కమర్షియల్ హంగుల కన్నా ఎక్కువగా నచ్చిన విషయం..!
Updated on: Nov 29, 2023 | 5:20 PM

ట్రెమండస్ ఫైట్లు, కలర్‌ఫుల్ పాటలు, వండర్‌ఫుల్ కామెడీ, అట్రాక్టివ్ జోడీ ఉంటే పక్కా కమర్షియల్ సినిమాను ఫిక్స్ చేసేయొచ్చు అనుకునే రోజులు ఇప్పుడు లేవు. ఫైట్లుండాలి. పాటలుండాలి. ఆన్‌స్క్రీన్ బెస్ట్ పెయిర్ ఉండాలి.. వీటన్నిటి కన్నా ముందు ఇంకోటి ఉండి తీరాలంటున్నారు స్టార్లు. ఆ ఇంకోటి ఏంటి? అనేనా మీ డౌట్.. డీటైల్డ్ గా మాట్లాడేసుకుందాం వచ్చేయండి.

పుష్ప చూసిన వాళ్లందరికీ, ఆ సినిమా కమర్షియల్ హంగుల కన్నా ఎక్కువగా నచ్చిన విషయం..! పెర్ఫార్మెన్స్. వీర లెవల్లో పెర్ఫార్మ్ చేశారు బన్నీ. ఐకాన్ స్టార్ అనే పేరున్నా పుష్ప సినిమా కోసం ఎన్నో విషయాలను కొత్తగా ట్రై చేసి, ది బెస్ట్ అనిపించుకున్నారు బన్నీ.

సేమ్ టు సేమ్ ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన వారు కూడా తారక్ అండ్ చెర్రీ పెర్ఫార్మెన్సుల గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు.

అంతెందుకు కోలీవుడ్ సూపర్‌స్టార్ జైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా రజనీకాంత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కి ఫుల్ మార్కులు పడ్డాయి. ఆయన ఏజ్‌కి తగ్గ కేరక్టర్‌లో అద్భుతంగా ఎలివేట్ అయ్యారు అంటూ మెచ్చుకున్నారు ఆడియన్స్.

అంతకు ముందు లోకేష్ కనగరాజ్ విక్రమ్‌లోనూ కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ పెర్పార్మెన్సులకే ఫిదా అయిపోయారు జనాలు. కథ ఎలాంటిదైనా, కథలో నటించేది ఎవరైనా, తాము చేసే కేరక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉందా లేదా? అనేది పాత మాట.

పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఇష్టంగా చెక్ చేసుకుంటున్నారు స్టార్స్. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, అఖండ, భగవంత్ కేసరి సినిమాల్లో బాలయ్య కూడా పెర్ఫార్మెన్స్ కి మాంఛి స్కోప్ ఉన్న కేరక్టర్లే చేశారు. మన దగ్గరే కాదు, ప్యాన్ ఇండియా లెవల్లో కనిపిస్తున్న నయా ట్రెండ్ ఇది.




