2013లో వచ్చిన అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈషా రెబ్బా. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ చిన్నది నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి.