AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: అక్కడ రీఎంట్రీ ఇస్తోన్న నయనతార.. 73 ఏళ్ల హీరోకు జోడిగా..

లేడీ సూపర్ స్టార్ నయనతార నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత విషయాలతోనే నెట్టింట వైరలవుతుంది. తాజాగా నయనతారకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అదెంటో తెలుసుకుందామా.

Nayanthara: అక్కడ రీఎంట్రీ ఇస్తోన్న నయనతార.. 73 ఏళ్ల హీరోకు జోడిగా..
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2025 | 10:43 AM

Share

గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ నయనతార. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈమధ్య కాలంలో నయన్ పేరు ఎక్కువగా వార్తలలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తో గొడవ, డాక్యుమెంటరీ వివాదంతో ఆమె పేరు నిత్యం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది నయన్. దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్ళీ మలయాళ చిత్రంలో నటించడానికి సంతకం చేసిందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చి రెండు నెలలు అయ్యింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం నటించనుందనే టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా MMMN అనే పేరు పెట్టారు. 2008 చిత్రం ట్వంటీ:20 తర్వాత దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో కలిసి కనిపించనున్న చిత్రం ఇది.

ఆదివారం, చిత్ర నిర్మాణ సంస్థ, ఆండో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, నటి నయనతార షూటింగ్ సైట్‌కు వస్తున్న వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక నిమిషం నిడివి గల ఆ క్లిప్‌లో నయనతార మమ్ముట్టి, దర్శకుడు మహేష్ నారాయణన్ తో మాట్లాడుతూ కనిపించింది. 2016లో వచ్చిన ‘పుతియ నియమం’ సినిమా తర్వాత నయనతార, మమ్ముట్టి ఈ సినిమా కోసం తిరిగి కలిశారు. వీరిద్దరూ గతంలో భాస్కర్ ది రాస్కెల్ (2015), రప్పకల్ (2005), ధస్సారక్ వీరన్ (2005) వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

ఈ చిత్రంలో మోహన్ లాల్, మమ్ముట్టి, నయనతారలతో పాటు నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం, ప్రారంభోత్సవం గత ఏడాది నవంబర్‌లో శ్రీలంకలోని కొలంబోలో ఇద్దరు సూపర్‌స్టార్‌లు మమ్ముట్టి, మోహన్‌లాల్ సమక్షంలో జరిగింది. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయిలాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి వంటి వివిధ ప్రదేశాలలో 150 రోజుల పాటు షూటింగ్ జరిగింది.

ఇవి కూడా చదవండి

Source :

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన