Prabhas: ఏంటీ.. వర్షం సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా.. ! ఆ హీరో ఎవరంటే..
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గతేడాది కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు రాజా సాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఓవైపు కొన్ని రోజులుగా రాజాసాబ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ విడుదలయ్యాయి. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కెరీర్ మార్చిన సినిమా వర్షం. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు డార్లింగ్. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించారు. వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఫస్ట్ మూవీ. దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఇందులో విలన్ గా హీరో గోపిచంద్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ మూవీలో ప్రకాష్ రాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. 2004 జనవరి 14న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం ప్రభాస్ కాదట. అవును.. ఈ సినిమాకు హీరోగా డైరెక్టర్ శోభన్ మరో హీరోను అనుకున్నారట.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్షం సినిమాను తెరకెక్కించాలనుకున్నారట శోభన్. అందుకోసం వర్షం సినిమా కథను ముందుగా మహేష్ కు వినిపించారట. కానీ ఆ సమయంలో మహేష్ అంతగా ఆసక్తి చూపించలేదట. దీంతో అదే కథను ప్రభాస్ కు వినిపించగా.. వెంటనే అంగీకరించాడట. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ చిత్రానికి ఏకంగా మూడు నంది పురస్కారాలు వచ్చాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన



