AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: సాయి పల్లవి సినిమాపై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్.. ఆ హిట్ మూవీ గురించి ఏం చెప్పిందంటే..

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ సినిమాలపై మనసు పారేసుకుంది. దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడిగా నటిస్తుంది.

Janhvi Kapoor: సాయి పల్లవి సినిమాపై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్.. ఆ హిట్ మూవీ గురించి ఏం చెప్పిందంటే..
Janhvi Kapoor, Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 5:48 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ మూవీతో నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి పల్లవి నటించిన లేటేస్ట్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఏడాదిని బెస్ట్ మూవీతో ముగించానంటూ పోస్ట్ చేసింది.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ అమరన్. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2014లో జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో రూపొందించిన ఈ సినిమాపై ఇప్పటికే సినీప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ సైతం ఈ సినిమాపై రివ్యూ ఇచ్చింది.

“ఈ సినిమా చూడడం కొంచెం ఆలస్యమైంది. ఇందులో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. అమరన్ నా హృదయాన్ని కదిలించింది. ఇందులో ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి” అని రాసుకొచ్చింది.

Amaran, Janhvi

Amaran, Janhvi

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.