Dil Raju: మీ రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడుకోవద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్‌రాజు రియాక్షన్ ఇదే..
టీవల సినీ ఇండస్ట్రీలోని ప్రొడ్యుసర్లు, డైరెక్టర్లు, పలువురు నటులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ భేటీపై కూడా స్పందించిన కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( FDC ) చైర్మన్ దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిలాస ఘటన సినిమా ఇండస్ట్రీతోపాటు.. రాజకీయాలను సైతం కుదిపేస్తోంది.. అల్లు అర్జున్ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కావాలనే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని.. కక్షపూరితంగా వ్యవహరించారంటూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రొడ్యుసర్లు, డైరెక్టర్లు, పలువురు నటులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ భేటీపై కూడా స్పందించిన కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( FDC ) చైర్మన్ దిల్ రాజు స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అంటూ FDC చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని.. ఇది అందరికీ తెల్సిందేనంటూ దిల్ రాజు పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంక్షించారన్నారు.
— Chairman – Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024
హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగిందన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని సూచించారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నామని దిల్ రాజు పేర్కొన్నారు.
లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామంటూ దిల్ రాజు ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..