AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. కేటీఆర్ క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న ఫిర్యాదుతో.. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి..

KTR: అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. కేటీఆర్ క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Ktr
Shaik Madar Saheb
|

Updated on: Dec 31, 2024 | 4:30 PM

Share

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న ఫిర్యాదుతో.. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.. వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.. అంతేకాకుండా.. క్వాష్ పిటీషన్ పై తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో ప్రభుత్వం తరపున AG సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించగా.. కేటీఆర్‌ తరపున సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు.. BNS వచ్చాక IPC కింద ఎందుకు కేసు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది.. 14 నెలల క్రితం నేరం జరిగిందని ..ఐపీసీ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు చెప్పారు కేటీఆర్‌ న్యాయవాది.. విదేశీ సంస్థ పేరు ఏంటి అని ప్రశ్నించిన హైకోర్టుకు..FEO వివరాలు వెల్లడించారు.. 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని.. డబ్బుల ద్వారా లబ్ధిపొందింది కేటీఆర్ కాదంటూ తెలిపారు. కేటీఆర్‌పై ఐదు ఆరోపణలు చేశారు.. నిధులు చేరిన FEOను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. థర్డ్ పార్టీ లబ్ధిపొందిందని చెబుతున్నారు..కానీ థర్డ్‌ పార్టీ ఎవరో ఎఫ్‌ఐఆర్‌లో చెప్పలేదన్నారు. అప్పటి మంత్రిగా ఫైల్‌పై సంతకం చేసినందుకు కేసులో నిందితుడిగా చేర్చారన్నారు. అరవింద్‌కుమార్ ఫైల్ పెట్టారు..కేటీఆర్ సంతకం చేశారన్నారు. అగ్రిమెంట్‌ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందన్న సిద్ధార్ద్‌ దవే.. విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే నిబంధన ఉందా అని ప్రశ్నించారు. ఐపీసీ 405, 409పై సుప్రీం తీర్పులను కోర్టులో ప్రస్తావించిన కేటీఆర్‌ న్యాయవాది.. కేటీఆర్‌పై కేసును క్వాష్‌ చేయాలని కోరారు

సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ రూల్స్‌కి విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ప్రభుత్వ ఒప్పందాలు అన్ని బిజినెస్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలని.. కానీ అలా జరగలేదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఇప్పటికే ఈడి నోటీస్ ఇచ్చిందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..