Telangana: అమ్మ, నాన్న..సారీ.. నేను వెళ్లిపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి సూసైడ్ నోట్

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ విద్యార్ధి మోసపోయాడు. దీంతో ఉరివేసుకొని డిప్లొమా విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అమ్మ, నాన్న సారీ.. నేను వెళ్లిపోతున్నా.. అంటూ సుసైడ్ నోట్ల రాయడం అందర్నీ కలచివేసింది.

Telangana: అమ్మ, నాన్న..సారీ.. నేను వెళ్లిపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి సూసైడ్ నోట్
A Student Who Was Cheated By Cyber Criminals Committed Suicide In Karimnagar
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 31, 2024 | 4:06 PM

సైబర్ నేరాలకు ఓ విద్యార్ధి బలయ్యాడు. బంగారు భవిష్యత్ ఉన్న యువకుడు సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయి తనువు చాలించాడు.  తల్లిదండ్రులకు తెలిస్తే.. ఏమంటారనే భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు.. కళ్ల ముందే చనిపోవడంతో పేరెంట్స్ తట్టుకోవడం లేదు. కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషి వర్ధన్ డిప్లొమా పూర్తి చేశాడు. పై చదువులో కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చదువులో మంచి ప్రతిభను చాటుతున్నాడు. ఇటీవల ఈ విద్యార్ధికి టెలిగ్రామ్‌‌లో వచ్చిన మెసేజ్‌ను ఓపెన్ చేశాడు.  మా కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు డబుల్ వస్తాయని ఆశ చూపారు. మొదటగా 5000, 6000, 25000, 65000 వరకు పెట్టాడు. తరువాత 1,50,000 ప్రాఫిట్ చూపించారు.

మరిన్ని డబ్బులు పెడితే.. మరిన్ని డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పారు. ఇది నమ్మి మరింత పెట్టుబడి పెట్టాడు. మోసగాళ్లు రూ.2.50 వేలు కడితే మీ డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చని చెప్పారు. అయితే కొద్దీ నిమిషాల్లో అకౌంట్లో అప్పటికే డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ప్రాఫిట్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించారు. ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు మొత్తం లాగేసుకున్నారు.అయన అకౌంట్ నిల్‌గా మారిపోయింది. గమనించిన రిషివర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మానసికంగా ఇబ్బంది పడ్డారు. డబ్బుల పోయిన విషయం గురించి బాగా ఆలోచించాడు. అయితే ఆత్మహత్య కు ముందు.. ఓ సుసైడ్ నోట్ రాశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుండి వచ్చిన తమ్ముడు కిటికీలో నుండి చూడడంతో అన్న ఉరివేసుకున్నాడని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి హాస్పటల్‌కు తరలించే లోపే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కన్నా కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మ నాన్న నేను మోసపోయాను నా చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్లో రాసి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు రోదనలు మిన్నంటాయి. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వీణవంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి