AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు సీరియల్స్ కోసం పేరు మార్చుకున్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియానే షేక్ చేశాడు.. ఆ హీరో ఎవరంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక క్రేజ్ ఉన్న హీరోలలో యష్ ఒకరు. కన్నడ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు యష్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి.

Tollywood: ఒకప్పుడు సీరియల్స్ కోసం పేరు మార్చుకున్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియానే షేక్ చేశాడు.. ఆ హీరో ఎవరంటే..
Yash
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 6:48 PM

Share

రాకింగ్ స్టార్ యష్.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ హీరో సుపరిచితమే. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు అతడి కెరీర్ ను మార్చేశాయి. యష్ ఇంత పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నా.. తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. కన్నడలో సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. వెండితెరపై స్టార్ స్టేటస్ అందుకున్నప్పటికీ సింపుల్ లైఫ్ గడిపేందుకు ఇష్టపడతాడు యష్. ఇప్పటికీ తన తండ్రి బస్సు డ్రైవర్ గానే వర్క్ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా యష్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

యష్ తన అసలు పేరును మార్చుకున్నాడని మీకు తెలుసా.. అవును. యష్ మొదటి పేరు నవీన్. ఈ పేరు మొదటి నుంచి చాలా బలంగా వినిపించేది. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును యష్ గా మార్చుకున్నాడు. అందుకు గల కారణాన్ని యష్ స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. యశ్ ఓ ఇంటర్వ్యూలో తన పేరు నవీన్ నుండి యష్ గా ఎందుకు మార్చుకున్నాడో చెప్పాడు.

‘జాతకం ప్రకారం ఒక పేరు పెట్టాలి. ఇది ‘y’ అక్షరంతో ఉండాలి. అందుకే మొదట యశ్వంత్ అన పెట్టారు. అందరూ యష్ అని పిలిచేవారు. ఇక అదే పేరు అధికారికంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు. అతను జనవరిలో జన్మించాడు కాబట్టి అతనికి నవీన్ అని పేరు పెట్టారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి పేరు మారిపోయింది. సీరియల్లో నటించే సమయంలో చాలా మంది నవీన్ పేరుతో ఉండడంతో తన పేరు యష్ అని చెప్పానని.. ఇక అదే పేరు అఫీషియల్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. అతని రేంజ్ రోవర్ కారు యష్ పేరు మీద రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే