దయచేసి సాయం చేయండి.. నేను, నా ఫ్యామిలీ అలాంటి పరిస్థితిలో ఉన్నాం.. వైవా హర్ష ఎమోషనల్ వీడియో
హీరో సుహాస్ నటించిన కలర్ ఫొటోలో వైవా హర్ష నటన అందరికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో అందరి చేత కన్నీళ్లు పెట్టించాడీ కమెడియన్. ఈ సినిమా తర్వాత మరిన్ని సూపర్ హిట్ సినిమాల్లో ఛాన్స్‌లు అందుకున్నాడు. వివాహ భోజనంబు, మంచి రోజులొచ్చాయ్, కార్తికేయ 2, బింబిసార, బేబీ, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు నటుడు వైవా హర్ష. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయినా హర్ష తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫన్నీ వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు హర్ష. ముఖ్యంగా ఆయన చేసిన వైవా షార్ట్ ఫిలిం హర్షకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో అతని పేరు వైవా హర్షగా మారిపోయింది. ఇక సినిమాల్లో అవకాశాలు అందుకొని నటుడిగా రాణిస్తున్నాడు. సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కనిపిస్తూ నవ్వులు పూయించాడు హర్ష. రీసెంట్ గా ఆయన ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్ అనే సినిమా చేశాడు.
ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే హర్ష. అభిమానులను ఆకట్టుకుంటూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎప్పుడు కామెడీ వీడియోలను పంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్న వైవా హర్ష తాజాగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. దయచేసి సాయం చేయండి అని అభ్యర్ధించాడు వైవా హర్ష. ఈ ఎమోషనల్ వీడియోలో హర్ష మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!
” హాయ్ అందరికీ.. నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన చుట్టు పక్కల వాళ్లకు ఏదైనా సమస్య జరిగితే ఒకలా ఉంటుంది, మన వరకు వస్తే అది వేరేలా ఉంటుంది. అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నాము. మా అంకుల్ ఏ. పాపరావు.. ఆయన వయసు 91 ఏళ్ల అంకుల్‌కి అల్జీమర్స్ ఉంది. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. వైజాగ్‌లోని ఇంట్లోంచి ఆయన బయటకు వెళ్లారు. ఆయన్ను చివరి సారిగా కంచరపాలెం ఏరియాలో.. కనిపించారు. అదీ కూడా రెండు రోజుల క్రితం ఓ సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే వైజాగ్ లో ఉండే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో.. కుదిరితే సర్చ్ గ్రూప్స్ లా వెళ్లి అంకుల్‌ని వెతకడంలో సహాయం చేయండి. ఆయన కనిపిస్తే మొదట వెంటనే కాస్త ఫుడ్ ఇవ్వండి. ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఆయన వయసు 91 చాలా బలహీనంగా ఉన్నారు. మీలో ఎవరికి కనిపించినా వీడియోలో ఇచ్చిన నెంబర్స్‌కి చెప్పండి’ అంటూ హర్ష రిక్వెస్ట్ చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .