Vijay Deverakonda: పెద్ద కలలున్న అబ్బాయి.. భూవిపై ఉన్న ప్రతిదాన్ని సాధించాలనుకుంటాడు.. ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
కొద్దిరోజులుగా తన తదుపరి చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పెద్ద కలలున్న అబ్బాయి అంటూ తన
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే లైగర్ సినిమా అనంతరం రౌడీ హీరో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడం లేదు. కొద్దిరోజులుగా తన తదుపరి చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పెద్ద కలలున్న అబ్బాయి అంటూ తన ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు విజయ్. ప్రస్తుతం రౌడీ షేర్ చేసిన పిక్స్ నెట్టంట వైరలవుతున్నాయి.
“పెద్ద కలలున్న అబ్బాయి.. సూర్యుడి కింద ఉన్న ప్రతిదాన్ని సాధించాలని.. తనలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. దీంతో విజయ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మీకు అండగా మేమున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు విజయ్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల కథానాయికగా కనిపించగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు.
View this post on Instagram