Megastar Chiranjeevi: అన్నయ్య పై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి విలక్షమైన నటుడు.. అద్భుతమై న వ్యక్తిత్వంతో .. విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం..

Megastar Chiranjeevi: అన్నయ్య పై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..
Pm Modi, Megastar Chiranjee
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 21, 2022 | 2:36 PM

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం వరించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150 కి పైగా చిత్రాల్లో నటించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని.. ఆయనది ప్రత్యేకమైన కెరీ ర్ అంటూ అభినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు చిరు. ఇక మెగాస్టార్‏కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చిరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

“మెగాస్టార్ చిరంజీవి విలక్షమైన నటుడు.. అద్భుతమై న వ్యక్తిత్వంతో .. విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం… ఆదరణనూ పొందుతున్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక IFFI అవార్డ్ ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డ్ రావడానికి ప్రధాన కారణం తన అభిమానులేనని.. తనపై అంత ప్రేమ చూపిస్తున్న అభిమానులందరి వల్లే ఈరోజు తను ఇక్కడ ఉన్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.