AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aindrila Sharma: ఆమె జీవితమే ఓ యుద్ధం.. క్యాన్సర్‏తో పోరాడి గెలిచి.. విధి చేతిలో ఓడింది.. యువనటి మరణంతో షాక్‏లో ఇండస్ట్రీ..

అండ్రిలా జీవితమే ఓ యుద్ధంలా సాగింది. రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడింది.. ఇటీవల వరుస గుండెపోటులతో అల్లాడిపోయింది. చివరకు విధి చేతిలో ఓడిపోయి ప్రాణాలు వదిలింది.

Aindrila Sharma: ఆమె జీవితమే ఓ యుద్ధం.. క్యాన్సర్‏తో పోరాడి గెలిచి.. విధి చేతిలో ఓడింది.. యువనటి మరణంతో షాక్‏లో ఇండస్ట్రీ..
Aindrila Sharma
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2022 | 3:14 PM

Share

చిత్రపరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. ఇప్పటికే చాలా సార్లు గుండెపోటుకు గురైన 24 ఏళ్ల అండ్రిలా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నవంబర్ 1న ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. హౌరాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు మెదడులో రక్తస్రావం అయ్యిందని.. దీంతో ఆమె కోమాలోకి వెళ్లడంతో.. వెంటిలెషన్ పై చికిత్స అందించారు. కొద్దిరోజులాగ కోమాలో ఉన్న అండ్రిలా… ఈరోజు మరణించింది. అండ్రిలా మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అండ్రిలా జీవితమే ఓ యుద్ధంలా సాగింది. రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడింది.. ఇటీవల వరుస గుండెపోటులతో అల్లాడిపోయింది. చివరకు విధి చేతిలో ఓడిపోయి ప్రాణాలు వదిలింది. గతంలో అండ్రిలా రెండుసార్లు క్యాన్సర్ నుంచి కోలుకుంది. 2015లో ఇంటర్ చదువుతున్న సమయంలో తొలిసారిగా అండ్రిలా క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత 2021 లో మరోసారి ఊపిరితిత్తులో క్యాన్సర్ ఏర్పడింది. ఓవైపు క్యాన్సర్ తో పోరాడుతూనే నటన కొనసాగించింది. ఇక ఇటీవల ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆసుపత్రిలో చేర్పించగా.. కోమాలోకి వెళ్లిందని…దీంతో ఆమెకు వెంటిలెషన్ పై చికిత్స అందించారు డాక్టర్స్. 20 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన అండ్రిలా.. ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఓవైపు అండ్రిలా కోమాలో ఉండగానే.. శనివారం సాయంత్రం మరోసారి ఆమెకు గుండెపోటు వచ్చింది. మొత్తం 10సార్లు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆమెను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించిన.. విధి చేతిలో మాత్రం ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

పశ్చిమ బెంగాల్ లోని బెర్హంపూర్ లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె జుమూర్ ద్వారా బుల్లితెరలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహాపీఠ్ తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షాలలో నటించింది. అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి చిత్రాల్లో నటించింది.

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..