Varun Dhawan: తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా.. వరుణ్ ధావన్ ఇంటెస్టింగ్ కామెంట్స్
ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ మూవీ తెలుగులో విడుదలవుతుంది.
వరుణ్ ధవన్, కృతిససన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ మూవీ తెలుగులో విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వరుణ్ ధావన్ మాట్లాడుతూ..ఇది నాకు సొంత ఇల్లు లా అనిపిస్తుంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా అనేది నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం అన్నారు.
ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే.మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
ఇక హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ. . చాలా రోజులు తరువాత ఇక్కడికి రావడం చాలా హ్యాపీ గా ఉంది. నా కెరియర్ ను ఇక్కడే స్టార్ట్ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు, అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇది ఒక ఫన్ జర్నీ. ఈ సినిమాలో తోడేలు మెయిన్ హీరో.ఈ ట్రైలర్ మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తెలుగు, హిందీ, తమిళ్ లలో 2డి, 3డి వెర్సన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అంటూ చెప్పుకొచ్చింది.