Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ పై కేసు నమోదు.. కారణం ఇదే..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Nov 19, 2022 | 9:35 PM

ఆయన పై రాజమహేంద్ర వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోసాని పై 355, 500, 504,506,507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ పై కేసు నమోదు.. కారణం ఇదే..
Posani Krishna Murali

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పై పోలీస్ కేసు  నమోదు అయ్యింది. ఆయన పై రాజమహేంద్ర వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోసాని పై 355, 500, 504,506,507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇందిరా రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు పట్టించుకోకపోవడం, అలాగే కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు..

గత కొద్ది కాలంగా స్థానిక రెండో జేఎఫ్ సీఎం కోర్టులో ఇందిరా అనే మహిళ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది.  వాదనలు విన్న కోర్టు పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశించింది. ఇక రెండవ జేఎఫ్ సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా, ఈ మధ్యే పోసాని కృష్ణ మురళికి గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu