Sudigali Sudheer: గాలోడు చిత్రానికి సుధీర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా ?..  

తాను జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటానని.. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని ముందే చెప్పానని... ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని అన్నారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Sudigali Sudheer: గాలోడు చిత్రానికి సుధీర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా ?..  
Sudhee R
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2022 | 12:53 PM

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై సందడి చేసిన సుధీర్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో సహయక పాత్రలలో నటించారు. అలాగే పలు రియాల్టీ షోలకు యాంకర్‏గానూ పనిచేశారు. ఇక కొద్దికాలంగా జబర్ధస్త్ షోకు దూరంగా ఉంటున్న సుధీర్.. తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఆయన గాలోడు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శకత్వం వహించిన ఈ మూవీలో గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 18న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగాంగానే.. తాను జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటానని.. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని ముందే చెప్పానని… ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని అన్నారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సుధీర్ రెమ్యూనరేషన్‏కు సంబంధించిన న్యూస్ తెగ వైరలవుతుంది. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుధీర్.. ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం గాలోడు చిత్రానికి రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాక్.

ఇవి కూడా చదవండి

అలాగే జబర్ధస్త్ షో కోసం సుధీర్ రూ. 5 లక్షల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక తనకు ఆన్ స్క్రీన్ రోమాన్స్ ఇష్టముండదని తెలిపారు. రష్మీతో కెమిస్ట్రీ ఎలా జరిగిందో చెప్పలేనని.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటామని అన్నారు. అలాగే తన లేటెస్ట్ ఫిల్మ్ రిలీజ్ గాలోడు ప్రమోషన్లో ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోనంటూ… షాకింగ్ కామెంట్స్ చేశారు. కొశ్వ్చన్ అడిని యాంకర్‌కే జబర్దస్త్‌ రేంజ్‌ పంచ్ ఇచ్చారు. అయితే సుడిగాలి సుధీర్… రష్మితో లవ్‌లో ఉన్నారనే న్యూస్ నెట్టింట వైరల్ క్రమంలో… నేను..పెళ్లి చేసుకోను అంటూ.. ఈ బాయ్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి కాకుండా రష్మితో ఎప్పటికీ లివింగ్ రిలేషన్లో ఉంటాడేమో అనే అనుమానాన్ని అందరిలో కలిగిస్తోంది.