Varisu Movie: తెలుగు వర్సెస్ తమిళ్.. ముదురుతున్న వారసుడు సినిమా వివాదం.. రెండు ఇండస్ట్రీలకు మంచిది కాదంటున్న డైరెక్టర్స్..

తెలుగు సినిమాలు తమిళనాట ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల అవుతోంటే...తెలుగునాట అభ్యంతరాలపై మండి పడుతున్నారు తమిళ సినీ దర్శకులు. దర్శక, నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారే.. హీరో మాత్రమే తమిళ నటుడు. అంతమాత్రాన అడ్డుకుంటారా? అంటూ తెలుగు సినీ నిర్మాతల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు దర్శకులు సీమాన్.

Varisu Movie: తెలుగు వర్సెస్ తమిళ్.. ముదురుతున్న వారసుడు సినిమా వివాదం.. రెండు ఇండస్ట్రీలకు మంచిది కాదంటున్న డైరెక్టర్స్..
Varisu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2022 | 11:49 AM

వారసుడు మూవీ వివాదం ముదిరిపాకాన పడుతోంది. టాలీవుడ్‌-కోలీవుడ్‌ మధ్య లోకల్‌-నాన్‌లోకల్‌ వార్‌ రచ్చరేపుతోంది. తమిళ హీరో విజయ్‌ నటించిన సంక్రాంతి మూవీ రిలీజ్‌పై రగడ రాజుకుంది. డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దంటూ తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదలతో అగ్గి రాజుకుంది. వంశీ పైడిపల్లి, దిల్ రాజు, దర్శక నిర్మాతలుగా, విజయ్ హీరోగా వారసుడు సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీ కాకరేపుతోంది. తెలుగు సినిమాలు తమిళనాట ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల అవుతోంటే…తెలుగునాట అభ్యంతరాలపై మండి పడుతున్నారు తమిళ సినీ దర్శకులు. దర్శక, నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారే.. హీరో మాత్రమే తమిళ నటుడు. అంతమాత్రాన అడ్డుకుంటారా? అంటూ తెలుగు సినీ నిర్మాతల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు దర్శకులు సీమాన్. అక్కడ బ్రేకులేస్తే… ఇక్కడ చుక్కలు చేపిస్తామంటూ హెచ్చరిస్తోంది తమిళ సినీ ఇండస్ట్రీ.

రాజమౌళి బాహుబలి, ట్రిపుల్‌ ఆర్‌ ఇక్కడ హిట్‌ అవుతున్నాయి. తమిళ దర్శకులు తీసే సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడుతున్నాయి. భాషా సరిహద్దులను దాటిందే కళ. మీరు అక్కడ అడ్డుకుంటే… మేము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామంటూ దర్శకుడు పేరరసు కామెంట్స్ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేరరసు. ఇంత వివాదం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. తెలుగులో వారసుడు.. తమిళంలో వారిసు గా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటన కూడా చేసింది. అంతలోనే తెలుగు నిర్మాతలు షాకిచ్చారు. దీంతో టాలీవుడ్‌-కోలీవుడ్‌ మధ్య రగడ రచ్చరేపుతోంది. వారసుడు సినిమా వివాదం రెండు సినీ పరిశ్రమలకు మంచిది కాదని కామెంట్‌ చేశారు దర్శకుడు లింగుస్వామి.

ఇవి కూడా చదవండి

విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీకి డైరెక్టర్‌ వంశీపైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్‌రాజు. వీళ్లిద్దరూ తెలుగువాళ్లు. అయినా అడ్డుకోవడం ఏంటన్నది సిమన్ అభ్యంతరం. అయితే తమిళంలో స్ట్రయిట్‌ సినిమానే అయినా తెలుగులో మాత్రం డబ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వివాదమైంది. డబ్బింగ్ సినిమాలను సంక్రాంతికి రిలీజ్‌ చేయకుండా నిర్మాతల మండలి లేఖ విడుదల చేయడంతో తమిళ దర్శకుడు వార్నింగ్‌లు ఇచ్చేదాకా వెళ్లింది. ఈ లోకల్‌ లొల్లి ముదిరి ఎటు వైపు టర్న్ అవుతుందన్న చర్చ నడుస్తోంది.