Mrunal Thakur: సీతారామం బ్యూటీ సైలెంట్ అవవడానికి కారణం ఇదేనా..?

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Nov 19, 2022 | 9:57 PM

హిందీలో సూపర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇందులో హృతిక్ హీరోగా నటించారు. ఈ సినిమాలో మృణాల్ నటనకు ప్రశంసలు అందుకుంది.

Nov 19, 2022 | 9:57 PM
బుల్లితెరపై సహయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. హిందీలో సూపర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

Mrunal Thakur (1)

1 / 7
ఈ సినిమాలో మృణాల్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తూఫాన్, జెర్సీ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Mrunal Thakur (2)

2 / 7
ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన సీతామహాలక్ష్మీ పాత్రలో ఒదిగిపోయింది.

Mrunal Thakur (3)

3 / 7
చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈసినిమా భారీ విజయంతోపాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మృణాల్ అందం.. అభినయంకు దక్షిణాది ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దీంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో బిజీ కాబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మృణాల్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ రాలేదు.

Mrunal Thakur (4)

4 / 7
లేటేస్ట్ సమాచారం ప్రకారం సీతారామం తర్వాత ఈ బ్యూటీకి భారీగానే ఆఫర్స్ వస్తున్నాయట. మెగా ప్రాజెక్ట్స్ నుంచి అవకాశాలు వచ్చిన.. ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదట. అందుకు కారణం మృణాల్ రెమ్యూనరేషన్ పెంచడమే.

Mrunal Thakur (7)

5 / 7
సీతారామం హిట్ తర్వాత మృణాల్ మరో సినిమాకు సైన్ చేయలేదని.. తాను తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం రూ. కోటి వసూలు చేయాలని భావిస్తున్నారట.

Mrunal Thakur (5)

6 / 7
అలాగే తన నెక్ట్స్ మూవీస్ విషయంలో మృణాల్ అచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది

Mrunal Thakur (6)

7 / 7

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu